ETV Bharat / international

థాయ్ ప్రధానికి నిరసనల సెగ- రాజీనామాకు ససేమిరా

తన పదవికి రాజీనామా చేసేది లేదని థాయ్​లాండ్ ప్రధాని ప్రయూత్ తేల్చి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ప్రధాని రాజీనామా సహా, దేశంలో రాచరిక పాలనలో సంస్కరణల కోసం విద్యార్థులు రెండో రోజూ నిరసనల్లో పాల్గొన్నారు. గురువారం విధించిన అత్యయిక స్థితిని ధిక్కరిస్తూ ర్యాలీలు చేశారు.

Thai PM rejects calls to resign, braces for renewed protest
థాయ్ ప్రధానికి నిరసనల సెగ- రాజీనామాకు ససేమిరా
author img

By

Published : Oct 16, 2020, 9:39 PM IST

Updated : Oct 16, 2020, 9:50 PM IST

థాయ్​లాండ్​లో విద్యార్థుల నిరసనలు హోరెత్తుతున్నాయి. అత్యయిక స్థితిని ధిక్కరిస్తూ రాజధాని బ్యాంకాక్​లో వరుసగా రెండో రోజు భారీ ర్యాలీలు నిర్వహించారు విద్యార్థులు. ప్రధాని ప్రయుత్ చాన్​-ఒచా రాజీనామా, రాజ్యాంగ సవరణ సహా, దేశంలో రాచరిక పాలనలో సంస్కరణలను విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

నిరసనలను కట్టడి చేసేందుకు గురువారం రాజధానిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రయుత్ ప్రభుత్వం. భారీగా గుమిగూడటం, ఐదుగురికి మించి ఒక్కచోట చేరడంపైనా నిషేధం విధించింది.

రాజీనామాకు నో

ప్రధాని పదవికి రాజీనామా చేయనని ప్రయుత్ స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కాబట్టి రాజీనామా చేసే ఆలోచనే లేదని అన్నారు. పరిస్థితి మెరుగుపడితే 30 రోజుల గడువుకు ముందే అత్యయిక పరిస్థితిని తొలగిస్తామని ప్రకటించారు.

అదే సమయంలో, విద్యార్థుల నిరసనలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బ్యాంకాక్​లోని ప్రధాన కేంద్రాల్లో నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసింది పోలీసు విభాగం. రహదారులకు అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సమీపంలోని ప్రజా రవాణా స్టేషన్లను మూసివేశారు. పోలీసుల భద్రత చర్యలతో పాటు భారీగా కురిసిన వర్షాల కారణంగా తక్కువ సంఖ్యలోనే నిరసనకారులు బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

థాయ్ ప్రధానికి నిరసనల సెగ

గురువారం దాదాపు 10 వేల మంది నిరసనల్లో పాల్గొన్నారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మరో ఇద్దరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 51 మందిని అరెస్టు చేసినట్లు థాయ్​లాండ్ అధికారులు తెలిపారు.

సంస్కరణల కోసం

ఆగస్టులోనే ఈ ఉద్యమానికి ఆజ్యం పడింది. ఓ ర్యారీలో పాల్గొన్న విద్యార్థులు దేశంలో నియంతృత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చారు. థాయ్​లాండ్ రాజైన 'మహా వజిరాలోంగ్​కోర్న్'​ ఎక్కువ కాలం విదేశాల్లోనే గడపుతూ భోగాలు అనుభవిస్తున్నారని విమర్శలు కురిపించారు.

థాయ్​లాండ్​లో రాజ కుటుంబాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. వీరినే థాయ్​లాండ్ గుర్తింపునకు మూలస్తంభంగా పరిగణిస్తారు. రాజుతో పాటు రాజ కుటుంబ రక్షణ కోసం అక్కడ ఓ చట్టం కూడా ఉంది. దీని ప్రకారం రాజ కుటుంబీకులపై విమర్శలు చేసిన వారికి 15 ఏళ్ల శిక్ష విధిస్తారు.

రాచరికాన్ని పూర్తిగా రద్దు చేయడానికే నిరసనలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా.. నిరసనకారులు వాటిని కొట్టిపారేస్తున్నారు.

అనూహ్య ఘటన

బుధవారం థాయ్​లాండ్ రాణి సుతిదా, రాకుమారుడు దిపాంగ్​కోర్న్​ కాన్వాయ్​ వెళ్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. భద్రతా సిబ్బంది కాన్వాయ్​కు రక్షణగా ఉన్నారు. అయితే ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు.

Last Updated : Oct 16, 2020, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.