ETV Bharat / international

కొవిడ్ రోగులను క్షణాల్లో గుర్తిస్తున్న శునకాలు! - కనైన్ డిటెక్టింగ్ స్క్వాడ్

చెమట వాసన ద్వారా కొవిడ్ రోగులను క్షణాల్లో గుర్తిస్తున్నాయి శునకాలు. ఈ మేరకు కనైన్ డిటెక్టింగ్ స్క్వాడ్​ను మోహరించింది థాయ్​లాండ్ ప్రభుత్వం.

sniffer dogs
స్నిఫర్ డాగ్స్, శునకాలు
author img

By

Published : May 22, 2021, 6:34 AM IST

కొవిడ్ బాధితులను గుర్తించేందుకు థాయ్​లాండ్ ప్రభుత్వం శునకాలను రంగంలోకి దించింది. మురికివాడలు, నిర్మాణ ప్రాంగణాలు, మార్కెట్లలో కరోనా బాధితులను గుర్తించేందుకు కనైన్ డిటెక్టింగ్ స్క్వాడ్​ను మోహరించింది. చులాలాంగ్​కార్న్ యూనివర్శిటీ పశుసంవర్ధక పరిశోధకులు.. మనుషుల చెమట నుంచి వచ్చే వాసన ద్వారా కొవిడ్ బాధితులను గుర్తించేలా కొన్ని లేబ్రడార్ రిట్రీవర్స్ జాతి శునకాలను శిక్షణ ఇచ్చారు. ఈ నెల 10 నుంచి ఇప్పటివరకూ వెయ్యి మందిని ఇవి గుర్తించాయని చెబుతున్నారు.

detecting dogs
స్వేదం ద్వారా కొవిడ్​ రోగులను పసిగడుతున్న శునకాలు

"వ్యక్తుల స్వేదాన్ని మెటల్ కంటైనర్​లో ఉంచుతున్నాం. శునకాలు వాటిని వాసన చూసి క్షణాల్లో బాధితులను గుర్తించేస్తున్నాయి. భారత్, ఫిన్​లాండ్, దుబాయ్, జర్మనీల్లో ఇలాంటి ప్రయోగాలు చేశారని తెలిసింది. ఇప్పుడు మేం కూడా ఈ ప్రయత్నంలో సఫలమయ్యాం" అని పరిశోధనకర్త ప్రొఫెసర్ కీవాలీ చదరాంగ్ తెలిపారు.

detecting dogs
చెమట వాసన చూస్తున్న శునకం

ఇదీ చదవండి:'కొవిడ్ మరణాల సంఖ్యలో తేడాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.