థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా.. ఓ మీడియా సమావేశంలో రిపోర్టర్లపై శానిటైజర్ కొట్టి దురుసుగా ప్రవర్తించారు.
థాయ్‌లాండ్ కేబినెట్‌కు సంబంధించి ఆయన్ను విలేకర్లు పశ్నించగా.. "మీ పని మీరు చూసుకోండి" అని మండిపడ్డారు. వారిపై శానిటైజర్ కొట్టి సమావేశాన్ని ముగించారు.
గతంలోనూ..
2014లో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టిన అధికారంలోకి వచ్చిన ఆయన.. మీడియాతో దురుసుగా ప్రవర్తించే వ్యక్తిగా పేరుగాంచారు. గతంలో ఓసారి కెమెరా ముందు వద్ద అరటి తొక్కను ఎగరేశారు. 2018లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడటానికి నిరాకరించిన ప్రయూత్.. బదులుగా తన కట్అవుట్ను ఏర్పాటు చేసి.. "ఈ వ్యక్తిని అడగండి" అని చెప్పి వెళ్లి పోయారు.
ఇదీ చూడండి: 'నిజాలు తెలుసుకోకుండా ఏకపక్ష డిబేట్ సరికాదు'