terror attack news: పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆ దేశ సైనికులు 10 మంది చనిపోయారు. ఈ ఘటన నైరుతి బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో జరిగింది. స్థానికంగా భద్రతాదళాలు ఉన్న చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పాక్ సైన్యం తెలిపింది. ఈ ఘటన జనవరి 25-26న రాత్రి జరిగినట్లు ఆ దేశ మిలిటరీ మీడియా విభాగం అయిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది సైనికులు మరణించడంతో పాటు మరో ఉగ్రవాది కూడా హతమైనట్లు పేర్కొంది. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. అనంతరం జరిపిన సోదాల్లో మరో ముగ్గురు తీవ్రవాదులు పట్టబడినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ దాడి వెనక ఏ ఉగ్రవాద సంస్థ ఉందనే దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు.
బలూచిస్థాన్.. ఇరాన్, అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండడం వల్ల తరచూ ఇక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ప్రాంతంలోని చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని అనేక తిరుగుబాటు గ్రూపులు గతంలో కూడా చాలా దాడులు నిర్వహించాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: డ్రగ్స్ స్మగ్లర్ల చొరబాటు యత్నం.. 27 మందిని చంపిన సైన్యం