ETV Bharat / international

మరో నగరం తాలిబన్ల వశం- బైడెన్ హెచ్చరిక - బైడెన్​

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల దురాక్రమణకు అడ్డులేకుండా పోయింది. ఇప్పటికే ముఖ్యమైన ప్రావిన్సులను వశం చేసుకున్న తాలిబన్లు.. తాజాగా ఉత్తర అఫ్గాన్​లోని చివరి ప్రధాన నగరమైన మజార్​-ఇ-షరీఫ్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశ రాజధాని కాబుల్​ను కూడా చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ​

Taliban capture key northern
తాలిబన్ల ఆక్రమణ
author img

By

Published : Aug 15, 2021, 5:14 AM IST

Updated : Aug 15, 2021, 6:43 AM IST

అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే మూడింట రెండొంతుల దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా బల్ఖ్​ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్​ను స్వాధీనం చేసుకున్నారు. మజార్​-ఇ-షరీఫ్​.. ఉత్తర అఫ్గాన్​లో చివరి ప్రధాన నగరం. అఫ్గాన్​ సైనిక బలగాలుతో భీకర పోరు అనంతరం ఈ నగరంపై తాలిబన్లు పట్టు సాధించారు. ఈ నగరం నుంచి అఫ్గాన్​ సైనికులు పారిపోయినట్లు పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి. దీంతో ఉత్తర అఫ్గాన్​ మొత్తం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు అయింది.

ఫలితంగా దేశ రాజధాని కాబుల్​, తూర్పు ప్రాంతంలోని నంగర్​హార్​ ప్రావిన్స్​ రాజధాని జాలాలాబాద్​ నగరాలు మాత్రమే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. తాలిబన్లు కాబుల్​ను కూడా చుట్టుమట్టినట్లు సమాచారం. ఏ క్షణమైనా.. కాబుల్​ను ఆక్రమించనున్నట్లు తెలుస్తోంది.

పోరాడకుండానే..

మధ్య అఫ్గాన్​ ప్రావిన్స్ దైకుండి.. ఎలాంటి పోరాటం లేకుండానే తాలిబన్ల వశమైంది. ఈ మేరకు లొంగిపోయినట్లు అక్కడి ప్రజాప్రతినిది ఒకరు వెల్లడించారు.

బైడెన్ హెచ్చరిక..

అఫ్గానిస్థాన్​లోని తమ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అదనంగా మరో 1000 మంది సైనికులను పంపించాలని అధికారులను ఆదేశించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్​. ఇప్పటికే అఫ్గాన్​లో 1000 మంది అమెరికా సైనికులు ఉండగా.. గత వారం 3000 మందిని పంపాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా 5000 మంది సిబ్బందిని అఫ్గాన్​లో మెహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ మిషన్​కు అవరోదం కలిగించేలా తాలిబన్లు ప్రవర్తిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే దేశంలో రక్తపాతం జరగకుండా చర్యలు తీసుకోవాలని అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీకి సూచించారు బైడెన్​.

ఇదీ చూడండి: తాలిబన్ల దురాక్రమణపై అఫ్గాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

Last Updated : Aug 15, 2021, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.