ETV Bharat / international

Taliban Government: అఫ్గాన్​లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వాయిదా - అఫ్గాన్ ప్రభుత్వం

అఫ్గానిస్థాన్​లో సెప్టెంబర్​ 11న జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని(Taliban Government Oath) వాయిదా వేసుకున్నారు తాలిబన్లు(Taliban). న్యూయార్క్ ట్విన్​ టవర్స్​ను (9/11 Attack) కూల్చిన అదే రోజు ప్రమాణస్వీకారం నిర్వహించాలని చూసినా.. మిత్రపక్ష దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొన్నందున వాయిదా వేశారు.

Taliban
తాలిబన్లు
author img

By

Published : Sep 11, 2021, 10:10 AM IST

మిత్రపక్ష దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావటంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని(Taliban Government Oath) తాలిబన్లు వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. ఈనెల 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు(Taliban news).. సెప్టెంబర్​ 11న న్యూయార్క్‌ ట్విన్ టవర్లపై దాడికి (9/11 Attack) 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు.

ఆ దేశాలకు ఆహ్వానం..

పాకిస్థాన్‌, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్‌, ఖతార్‌ తదితర దేశాలకు తాలిబన్లు ఈ మేరకు ఆహ్వానం పంపగా.. రష్యా సహా కొన్ని మిత్రదేశాలు సెప్టెంబర్‌ 11న జరిగే కార్యక్రమానికి హాజరుకాలేమని పేర్కొన్నట్లు సమాచారం. అమానవీయ ఘటన జరిగినరోజు తాలిబన్లు(Afghanistan Taliban) నిర్వహిస్తున్న మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావద్దని అమెరికా.. ఖతార్‌పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాలిబన్లు తమ కేబినెట్‌ ప్రమాణస్వీకారోత్సవాన్ని(Taliban Government Oath) వాయిదా వేసుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికా విమానం రెక్కకు తాడుకట్టి ఊయలూగిన తాలిబన్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.