ETV Bharat / international

తాలిబన్ 2.0 అరాచకాలు షురూ- విగ్రహం ధ్వంసం - తాలిబన్​ వార్తలు

అఫ్గానిస్థాన్​లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబన్లు తమ అరాచకాలను మొదలుపెట్టారు. హజారా నాయకుడు అబ్దుల్​ అలీ మజారీ విగ్రహాన్ని పేల్చి వేశారు. ప్రజల భయాలను నిజం చేస్తూ విధ్వంసాలకు దిగుతున్నారు.

Taliban blows up slain Hazara leader Abdul Ali Mazari's statue in Bamiyan
తాలిబన్ 2.0 అరాచకాలు షురూ- విగ్రహం ధ్వంసం
author img

By

Published : Aug 18, 2021, 1:30 PM IST

Updated : Aug 18, 2021, 2:35 PM IST

తాలిబన్లు అధికారంలోకి వస్తే రెండు దశాబ్దాల క్రితం నాటి వారి అరాచక పాలన మళ్లీ వస్తుందని భయపడుతున్న ప్రజల అంచనాలే నిజమవుతున్నాయి. హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రాహాన్ని వారు పేల్చి వేశారు. బామియాన్​లో ఉన్న ఈ ప్రతిమను నామరూపాల్లేకుండా చేశారు. గతంలో ఈ ప్రాంతంలోనే బుద్ధుని విగ్రహం, చారిత్రక కట్టడాలను తాలిబన్లు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మానవహక్కుల ఉద్యమకారుడు సలీ జావేద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అఫ్గాన్​ ప్రజలకు తాలిబన్లు చాలా పెద్ద క్షమాభిక్ష పెట్టారని మండిపడ్డారు.

హజారా నేత అబ్దుల్​ అలీని 1995లోనే తాలిబన్లు ఉరితీశారు. చాలా ఏళ్లుగా ఆ వర్గం వారిపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు.

హజారాలు ఓ సంప్రదాయ తెగ. మధ్య అఫ్గాన్​లోని పర్వత ప్రాంతం హజారత్​లో వారు అధికంగా ఉంటారు. 13 శతాబ్దానికి చెందిన మొంగోల్​ రాజ్య స్థాపకుడు గెంఘిస్ ఖాన్​కు వారసులుగా వీరిని చెప్పుకుంటారు.

తమ వర్గానికి చెందిన సలీమా హజారీని కూడా తాలిబన్లు నిర్బంధించారని హజారా వర్గాలు తెలిపాయి. అఫ్గాన్​ జిల్లాలకు ఉన్న అతికొద్ది మంది మహిళా గవర్నర్లలో ఈమె ఒకరు.

ఇదీ చూడండి: శాంతి జపంతో మీడియా ముందుకు తాలిబన్లు

అఫ్గానీలకు అభయం- తాలిబన్ల కొత్త వ్యూహం

Last Updated : Aug 18, 2021, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.