తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని చైనా(Taiwan China News) ధృడ నిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన చైనాకు కొందరు నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తైవాన్‌ను ఎన్నటికీ చైనాలో(Taiwan China News) విలీనం కానీయబోమని అక్కడి నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై చైనా త్రీవంగా స్పందించింది. "తైవాన్(China And Taiwan Conflict) మా భూభాగం. ఏదో రోజు అవసరమైతే బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటాం"అని తెలిపింది. తైవాన్ స్వతంత్రంగా ఉండాలని పోరాడుతున్న నేతలను నేరస్థులుగా పరిగణించి కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది.
నేతలతోపాటు వారి కుటుంబసభ్యులను కూడా చైనా భూభాగంలోకి రాకుండా, ఇక్కడి వారితో ఎలాంటి సంబంధాలు లేకుండా నిషేధిస్తామని చైనాలోని తైవాన్ వ్యవహారాల కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో తైవాన్ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్న నేతల జాబితాను సైతం సిద్ధం చేసింది. ఇప్పటికే పలువురు నేతలను చైనా భూభాగంలోకి రాకుండా నిషేధించినట్లు సమాచారం.
గురువారం యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల బృందం తైవాన్‌లో పర్యటిస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, తైవాన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. యూరోపియన్ పార్లమెంట్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే చైనా తైవాన్‌కు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం చైనా-తైవాన్(Taiwan China News) వ్యవహారంలో మరింత వేడి రాజేసినట్లుగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి: 'చైనాలో భాగం కావటం తప్ప.. తైవాన్‌కు భవిష్యత్తు లేదు'