ETV Bharat / international

పాపువా న్యూ గినీలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు - earthquake news latest

పాపువా న్యూ గినీ తీరప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3 తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలున్నాయని యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Strong quake strikes near Papua New Guinea, tsunami possible
భారీ భూకంపం
author img

By

Published : Jul 17, 2020, 10:46 AM IST

పాపువా న్యూ గినీకి సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు యూఎస్ పసిఫిక్​ సునామీ హెచ్చరికల కేంద్ర వెల్లడించింది. ఆ దేశ తీర ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 300 కి.మీ దూరం వరకు ప్రమాదకర సునామీ వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

పాపువా న్యూ గినీ పోపోండెట్టాకు ఉత్తర- వాయవ్య దిశలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 80 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు పేర్కొంది. సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం 7.3 తీవ్రతతో బలమైన భూప్రకంపనలను గుర్తించినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.