ETV Bharat / international

న్యూజిలాండ్​, ఇండోనేసియాల్లో భూకంపాలు

ఇండోనేసియా, న్యూజిలాండ్​లలో భూకంపాలు సంభవించాయి. న్యూజిలాండ్​లో రిక్టర్​ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు కాగా.. అక్కడ సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇండోనేసియాలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది.

earthquake in indonesia
ఇండోనేసియాలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత
author img

By

Published : Feb 10, 2021, 8:55 PM IST

Updated : Feb 10, 2021, 10:01 PM IST

న్యూజిలాండ్​లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. లాయల్టీ దీవులకు ఆగ్నేయ దిశలో సముద్ర అంతర్భాగాన భూమిలో కదలికలు ఏర్పడ్డాయని అమెరికా జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సునామీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. వనాటు, ఫిజీ, ఆస్ట్రేలియాల్లో సునామీ ప్రభావం ఉంటుందని పేర్కొంది.

ఇండోనేసియాలో 6.2 తీవ్రత

పశ్చిమ ఇండోనేసియాను బుధవారం భూకంపం కుదిపేసింది. సముద్ర అంతర్భాగంలో భూమిలో కదలికలు ఏర్పడ్డాయి. రిక్టర్​ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. బెంగ్​కులు నగరానికి నైరుతిదిశలో 217 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

ఇక్కడ సునామీ వచ్చే ప్రమాదాలు ఏవీ లేవని ఇండోనేసియా వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని వెల్లడించింది.

'రింగ్​ ఆఫ్​ ఫైర్'​ పరిధిలో న్యూజిలాండ్​, ఇండోనేసియాలు ఉండడం వల్ల అక్కడ తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:సౌదీ ఎయిర్​పోర్ట్​పై దాడి- ఓ విమానానికి మంటలు

Last Updated : Feb 10, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.