ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ శివారులో గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం బహుమతిగా అందజేసిన ఈ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మెల్‌బోర్న్ శివారులోని 'ఆస్ట్రేలియా ఇండియా సామాజిక కేంద్రం'లో ఏర్పాటుచేశారు. ఆ దేశ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ రాజ్‌కుమార్, పలువురు ఆస్ట్రేలియా నేతలు పాల్గొన్నారు.
అనంతరం గంటల వ్యవధిలోనే దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు 'ద ఏజ్' దినపత్రిక తెలిపింది. మరోవైపు, విగ్రహం ధ్వంసం ఘటనపై ప్రధాని మోరిసన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఇలాంటి అవమానకర ఘటనలను చూడడం చాలా విషాదకరం. నన్ను తీవ్రంగా నిరాశపరిచింది' అని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడినవారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: