శ్రీలంకలో ఈస్టర్ సండే రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మృతి చెందిన 10మంది భారతీయుల్లో తొమ్మిదిమంది మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. 4 ప్రత్యేక విమానాల్లో మృతదేహాల్ని భారత్కు తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పార్థివ దేహాల్ని అప్పగించారు.
జేడీఎస్ కార్యకర్తలకు దేవెగౌడ నివాళి
లంక పేలుళ్లలో కర్ణాటకకు చెందిన 10 మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు జేడీఎస్ కార్యకర్తలు. ఐదుగురి మృతదేహాలు మంగళవారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం నాలుగు మృతదేహాలు చేరాయి. పార్థివ దేహాల వద్ద జేడీఎస్ దళపతి హెచ్డీ దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. అధికార కూటమిలో భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్ నేతలూ నివాళులర్పించారు.
షాంగ్రీలా హోటళ్లో ఉదయం అల్పాహారం భుజిస్తున్న జేడీఎస్ కార్యకర్తల బల్లకు అత్యంత సమీపంలోనే పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన కర్ణాటకకు చెందిన మరోవ్యక్తిని భారత్కు రప్పించి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'పాతిక సీట్లతోనే ప్రధాని అయిపోవాలని ఆశ'