ETV Bharat / international

'స్పుత్నిక్​-వీతో కొత్తరకం కరోనానూ అరికట్టవచ్చు'

author img

By

Published : Dec 21, 2020, 10:07 PM IST

Updated : Dec 21, 2020, 10:15 PM IST

ఐరోపాలో కనిపించే కొత్తరకం కరోనాపై తమ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని స్పుత్నిక్​-వీ వ్యాక్సిన్​ సీఈఓ దిమిత్రివ్​ తెలిపారు. ఈ మేరకు కొత్తరకం కొవిడ్​-19పై వ్యాక్సిన్​ను రూపొందించేందుకు తాము ఆస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు.

Sputnik V can be highly effective against new COVID-19 strain: Vaccine codeveloper
'స్పుత్నిక్​-వీతో కొత్తరకం కరోనానూ తరిమికొట్టొచ్చు'

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వీ.. ఐరోపాలో ఇటీవల ప్రబలుతున్న కొత్తరకం కరోనాపై కూడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు టీకా అభివృద్ధి సహకార సంస్థ, రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్(ఆర్డీఐఎఫ్​) సీఈఓ కిరిల్​ దిమిత్రివ్​ చెప్పారు.

ఐరోపా దేశాల్లో వ్యాపిస్తోన్న కొత్తరకం కరోనా జాతికి వ్యతిరేకంగా స్పుత్నిక్​-వీ అమోఘంగా పనిచేస్తుందని దిమిత్రివ్​ తెలిపారు. ఎస్​-ప్రొటీన్​లో​ మునుపటి ప్రవర్తనలు ఉన్నప్పటికీ.. తాము రూపొందించిన టీకా.. సమర్థత చూపుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే.. కొత్తగా ప్రబలుతోన్న కరోనాను అంతమొందించేందుకు ఆస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

స్పుత్నిక్​-వీ 95 శాతానికిపైగా ప్రభావం చూపుతోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ ఇటీవల పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్​ 96-97 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని మరికొందరు వైద్య నిపుణులు చెప్పారని రష్యన్​ విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: కరోనా సమాచారంపై చైనా కుట్ర నిజమే..

Last Updated : Dec 21, 2020, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.