ETV Bharat / international

రికార్డ్​ సృష్టించిన దక్షిణ కొరియా 'సూర్యుడు' - South Korea researches on Artificial Sun

దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు 20సెకండ్ల పాటు 10కోట్ల డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతతో మండి.. సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కొరియన్​, సియోల్​ దేశాల పరిశోధకులు సంయుక్తంగా రూపొందించిన 'కె-స్టార్​(సూర్యుడి పేరు)'.. 2008లోనే సంచలనం సృష్టించగా.. వచ్చే ఐదేళ్లలో కనీసం 6 నిమిషాల పాటు  అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

South Korea's artificial sun burns 20 seconds at a temperature of 10 billion degrees Celsius and creates a new world record
కొరియా కృత్రిమ సూర్యుడు
author img

By

Published : Dec 30, 2020, 7:14 AM IST

దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు! 20 సెకండ్ల పాటు ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో జ్వలించాడు. కొరియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యుజన్‌ ఎనర్జీ, సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడి పేరు... కె-స్టార్‌(ది కొరియా సూపర్‌ కండక్టింగ్‌ టొకమాక్‌ అడ్వాన్స్​డ్​ రీసెర్జ్‌). 2008లోనే తొలిసారిగా ఇది సంచలనం సృష్టించింది.

అదే లక్ష్యం..

అయితే.. 2025 నాటికి దీన్ని కనీసం 300 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలన్నది పరిశోధకుల లక్ష్యం. ఈ దిశగా సూర్యుని మాదిరే కె-స్టార్‌లోనూ వారు జ్వలన(ఫ్యుజన్‌) ప్రతిస్పందనలను కలిగిస్తున్నారు. దీని కోసం వారు హైడ్రోజన్‌ నుంచి ప్లాస్మాను సేకరించారు. ఇందులో 100 మిలియన్‌ డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన ఆయాన్లు ఉంటాయి. ఫ్యుజన్‌ రియాక్టర్‌ సాయంతో ఆయాన్లను అధిక వేడిలో ఉంచడం ద్వారా... ప్లాస్మా 100 మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో 20 సెకండ్ల పాటు కొనసాగేలా పరిశోధకులు విజయం సాధించారు.

"వాణిజ్య అణు ఫ్యుజన్‌ రియాక్టర్లలో ప్లాస్మా ఆపరేషన్‌ చాలా కీలకమైనది. భవిష్యత్తులో ఈ పదార్థం అత్యంత ప్రభావవంతంగా, దీర్ఘకాలం పనిచేసేలా సాంకేతికతను రూపొందించడంలో ఈ పరిశోధన దోహదపడుతుంది." అని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'ఇలా అయితే టీకా అందేసరికి ఏళ్లు గడిచిపోతాయ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.