సాంకేతికత వినియోగంలో తమకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్న దక్షిణ కొరియా(drone taxi korea) మరో ఘనత సాధించింది. వాయు మార్గంలో తక్కువ ఖర్చుతో సమయాన్ని ఆదా చేసే అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్‌ను(urban air mobility vehicles) విజయవంతంగా ప్రదర్శించింది.
2025 నాటికి సియోల్ ప్రజలను ఈ డ్రోన్ ట్యాక్సీల ద్వారా విమానాశ్రయాలకు తీసుకురావాలని దక్షిణ కొరియా భావిస్తోంది. ఈ డ్రోన్ ట్యాక్సీలు ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గిస్తాయని వెల్లడించింది.
సియోల్‌లోని గింపో విమానాశ్రయంలో డ్రోన్ ట్యాక్సీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. డ్రోన్ ట్యాక్సీలు పర్యావరణ అనుకూల వాయు రవాణా సేవలను అందిస్తాయని దక్షిణ కొరియా రవాణశాఖ తెలిపింది. డ్రోన్ ట్యాక్సీ ల్యాండింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇది నిలువుగా కూడా ల్యాండ్ అవుతుందని వెల్లడించింది. రెండు సీట్లు ఉండే డ్రోన్ ట్యాక్సీని ఈ ప్రదర్శనలో పరీక్షించారు. వచ్చే ఏడాది నాటికి టెస్ట్ ఫ్లైట్‌లను ప్రారంభిస్తామని, ఐదు సీట్ల వెర్షన్‌ను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది.
వాణిజ్య పట్టణ విమాన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. గత ఏడాదే రోడ్ మ్యాప్ ప్రకటించిన దక్షిణ కొరియా 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఈ డ్రోన్ ట్యాక్సీలు గంటలో చేరుకునే గమ్యాన్ని 20 నిమిషాల్లోనే చేరుకుంటాయని దక్షిణ కొరియా వెల్లడించింది. పౌరుల రోజు వారి జీవితంలో యూఏఎమ్లు ఒకటిగా మారుతాయని.. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పరీక్షించి వీటిని అందుబాటులోకి తెస్తామని దక్షిణకొరియా రవాణామంత్రి నోహ్ హియోంగ్ ఓక్ తెలిపారు.
ఇదీ చదవండి: