ETV Bharat / international

చైనా వ్యాక్సిన్​ రెడీ.. ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు

కరోనా వ్యాక్సిన్​పై సినోఫార్మ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తాము అభివృద్ధి చేసిన టీకాను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి కావాలని చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. వివిధ దేశాల్లో వ్యాక్సిన్​పై నిర్వహిస్తున్న క్లినికల్​ పరీక్షల్లో సత్ఫలితాలు అందుతున్నాయని వెల్లడించింది.

sinopharm drug company applied for vaccine marketisation
చైనా వ్యాక్సిన్​ రెడీ.. ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు
author img

By

Published : Nov 25, 2020, 10:27 PM IST

వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న క్లినికల్​ పరీక్షల్లో తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా​ మెరుగైన ఫలితాలను అందిస్తోందని చైనాకు చెందిన సినోఫార్మ్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు తమ వ్యాక్సిన్​​ను మార్కెట్​లోకి విడుదల చేసేందుకు అనుమతి కావాలని చైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

"వివిధ దేశాల్లో జరిపిన వ్యాక్సిన్​ క్లినికల్ ట్రయల్స్​ సమాచారాన్ని సేకరించి, నివేదిక రూపంలో చైనా ప్రభుత్వానికి అందించాం. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ప్రభుత్వమే."

---- సినోఫార్మ్​ సంస్థ.

ప్రస్తుతం వ్యాక్సిన్​ ట్రయల్స్​ చివరి దశలో ఉన్నాయని, ప్రభుత్వం టీకాను అనుమతిస్తే మూడో దశ ఫలితాలను జర్నల్స్​లో విడుదల చేస్తామని సంస్థ సభ్యుల్లో ఒకరు తెలిపారు.

చైనాకు చెందిన ఐదు వ్యాక్సిన్​లు ప్రస్తుతం యూఏఈ, బ్రెజిల్, పాకిస్థాన్​, పెరూలో క్లినికల్​ పరీక్షలు జరుపుకుంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి జావో లిజియన్ ఇటీవలే ప్రకటించారు.

ఇదీ చదవండి :ఏడాది చివరి నాటికి చైనా వ్యాక్సిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.