ETV Bharat / international

సింగపూర్​లో కరోనా తగ్గుముఖం.. ఆంక్షల్లో సడలింపు

ప్రపంచ దేశాలపై కరోనా కరాళ విజృంభణ ఏ మాత్రం తగ్గట్లేదు. రోజుకో స్థాయిలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 3కోట్ల 49లక్షల మందికి వైరస్​ సోకింది. మహమ్మారి కారణంగా 10లక్షల 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సింగపూర్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున.. ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనుంది అక్కడి ప్రభుత్వం.

Singapore set for further easing of coronavirus restrictions; new cases continue to fall
సింగపూర్​లో కరోనా తగ్గుముఖం.. ఆంక్షల్లో సడలింపు
author img

By

Published : Oct 3, 2020, 8:19 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకూ సుమారు 3 కోట్ల 49 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. 10లక్షల 34వేల మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు 2కోట్ల 59లక్షల మందికిపైగా వైరస్​ను జయించగా.. 79 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు.

సింగపూర్​లో ఆంక్షలు సడలింపు

సింగపూర్​లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశంలో శనివారం 6 కొత్త కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 57,800కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 27 మంది వైరస్​తో చనిపోయారు.

నేపాల్​ పీఎం ప్రధాన సలహాదారుకు కరోనా

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రధాన సలహాదారు సహా మరో ఇద్దరు సహాయకులకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు ఇటీవల తమను కలిసిన వారంతా తగు జాగ్రత్తలు పాటించాలని ట్విట్టర్​, ఫేస్​బుక్​లో కోరారు. నేపాల్​లో కొత్తగా 528 కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 84,500 దాటింది.

  • కొవిడ్​ కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 75.55 లక్షల మందికి వైరస్​ సోకింది. కరోనాతో 2.13లక్షల మందికిపైగా ప్రాణాలు విడిచారు.
  • రష్యాలో కొత్తగా 9,859 కరోనా కేసులు వెలుగు చూడగా.. బాధితుల సంఖ్య 12,04,502కు ఎగబాకింది. మరో 128 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 21,251కి చేరింది.
  • మెక్సికోలో శనివారం ఒక్కరోజే 4,775 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 7,53,090కు పెరిగింది. వైరస్ సోకిన వారిలో మరో 414 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 78,492కు ఎగబాకింది.
  • పాక్​లో మరో 553 మందికి కొవిడ్​ సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 14వేలకు చేరువైంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,507 మంది వైరస్​ కారణంగా మరణించారు.

ఇదీ చదవండి: 'అధ్యక్షుడికే కరోనా.. ఇకనైనా తీవ్రంగా పరిగణించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.