భారత్ సహా.. ఆరు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు సింగపూర్ ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఆరు దేశాల్లో కొవిడ్ పరిస్థితులు కొన్నాళ్లుగా స్థిరంగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. దీంతోపాటు పొరుగు దేశాలైన మలేషియా, ఇండోనేషియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలోనూ కఠిన నిబంధనలు సడలించినట్లు తెలిపారు.
ఆంక్షలు సడలించిన జాబితాలో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో 14 రోజుల ట్రావెల్ హిస్టరీ ఉన్నవారు ఈ నెల 27 నుంచి సింగపూర్ వచ్చేందుకు, లేదా సింగపూర్ మీదుగా రాకపోకలు సాగించేందుకు అనుమతిస్తున్నట్లు స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. వచ్చేవారు మొదటి 10 రోజులు ఇళ్లలోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంది!
నవంబంర్ 1 నుంచి శ్రీలంకలో బూస్టర్ డోసు!..
శ్రీలంకలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలను మరింత సడలించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబర్ 1 నుంచి ఆరోగ్య, సెక్యూరిటీ, విమానాశ్రయ, పర్యాటక రంగాల సిబ్బందికి మూడో డోస్ ఇవ్వడం ప్రారంభిస్తామని, వయోవృద్ధులకు ప్రాధాన్యం ఉంటుందని మంత్రి చన్నా జయసుమన తెలిపారు.
అక్కడ ఇప్పటికే 59 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన రైలు సేవలు వచ్చే వారం పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవీ చదవండి: