ETV Bharat / international

సింగపూర్​ పార్లమెంటు రద్దు- త్వరలో ఎన్నికలు - dissolve Parliament

సింగపూర్ ప్రధాని లీ షియాన్ లూంగ్ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించిన లీ పార్లమెంట్ రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిట్ జారీ చేయాలని అధ్యక్షుడు హాతలీమా యాకోబ్​కు విజ్ఞప్తి చేశారు.

lee
సింగపూర్​లో ఎన్నికలకు అధ్యక్షుడికి ప్రధాని సిఫార్సు
author img

By

Published : Jun 23, 2020, 4:44 PM IST

ప్రపంచ దేశాలన్నీ కరోనాను ఎదుర్కొనేందుకు పోరాడుతున్న వేళ.. సింగపూర్​ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆరునెలల గడువు ఉండగానే.. సాధారణ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు ప్రధానమంత్రి లీ షియాన్​ లూంగ్. టీవీ ప్రసంగం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన లీ.. నూతన ఎన్నికల నిర్వహణ కోసం పార్లమెంట్​ను రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు రిట్​ జారీ చేయాలని అధ్యక్షుడు హలీమా యాకోబ్​కు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల నిర్వహణతో ప్రస్తుతం పాలనలో ఎదురవుతున్న అవాంతరాలు తొలగిపోతాయని.. నూతన ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు సింగపూర్ అభివృద్ధి అజెండాతో పనిచేసేందుకు వీలు కలుగుతుందని లీ షియాన్ పేర్కొన్నారు. లీ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీకి ప్రస్తుత పార్లమెంట్​లో సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే అనూహ్యంగా పార్లమెంట్ రద్దుకు ప్రధాని సిఫార్సు చేసిన నేపథ్యంలో 2021 ఏప్రిల్​లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

కరోనా నియంత్రణకు సమర్థ పోరు..

కరోనా నియంత్రణకు సమర్థంగా పనిచేసినట్లు వెల్లడించారు లీ షియాన్. నాలుగు బడ్జెట్లకు సమాన మొత్తమైన 100 బిలియన్ సింగపూర్ డాలర్లను వైరస్​పై పోరుకు కేటాయించినట్లు చెప్పారు. మహమ్మారి కారణంగా సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో నష్టపోలేదని వెల్లడించారు.

'ఏ ప్రమాదం ముంచుకొస్తుందో'

అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని పేర్కొన్నారు లీ షియాన్. అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ స్వయంప్రతిపత్తి వ్యవహారం, భారత్- చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు సింగపూర్​పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ఏడాది సింగపూర్​ పైకి ఏ విపత్తు వస్తుందో మనకు తెలియదని అన్నారు.

ఇదీ చూడండి: ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్​... ఎందుకిలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.