సామాజిక మాధ్యమాల్లో పాపులర్ కావడానికి పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు రకరకాల వీడియోలు చేస్తుంటారు. వాటిలో కొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మరికొన్ని యూజర్లకు నచ్చే విధంగా ఉంటాయి. కానీ, రష్యాకు చెందిన సెర్గీ కోసెంకో మాత్రం ప్రమాదకరంగా వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అందులో ఏముంది?
కోసెంకోకు సామాజిక మాధ్యమాల్లో 50 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతడు ఇటీవల 'ట్రస్ట్ టెస్ట్' పేరుతో తన ప్రియురాలిని కారుపై తిప్పాడు. ఇందులో ఇబ్బందేం ఉందనుకుంటున్నారా? అయితే అతడు కారులో కూర్చొపెట్టుకుని తిప్పలేదు. కారును డ్రైవ్ చేస్తూ అతడి చేతిని ఆ అమ్మాయి చేతితో సంకెళ్లతో బిగించి కారు పైకప్పుకు ఆ అమ్మాయిని కట్టి మాస్కో వీధుల్లో ప్రయాణించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ విషయం తెలిసిన అక్కడి పోలీసులు కోసెంకోకు జరిమానా విధించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఇందులో సరదా ఏముంది? ఇది ప్రమాదకరంగా ఉంది. దీన్ని పిల్లలు అనుసరిస్తే చాలా ఇబ్బంది" అని కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి: Viral video: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి హల్చల్