ETV Bharat / international

'పరారీ'లో షరీఫ్- బ్రిటన్​ను ఆశ్రయించిన పాక్​ - నవాజ్​ షరీఫ్​

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ పరారీలో ఉన్నట్టు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. షరీఫ్​కు ఇచ్చిన బెయిల్​ గడువు గతేడాదే ముగిసిందని.. అయినప్పటికీ ఆయన దేశానికి తిరిగి రాలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో షరీఫ్​ను అప్పగించాలని బ్రిటన్​ ప్రభుత్వాన్ని కోరింది పాక్​.

Sharif an 'absconder', UK approached for his extradition: PM aide
పరారీలో షరీఫ్​.. బ్రిటన్​ను ఆశ్రయించిన పాక్​
author img

By

Published : Aug 23, 2020, 6:01 PM IST

లండ్​న్​లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​ను పరారీలో ఉన్నట్టు ప్రకటించింది పాకిస్థాన్​. ఆయన్ను అప్పగించాలని బ్రిటన్​ ప్రభుత్వాన్ని కోరింది.

షరీఫ్​కు ఇచ్చిన నాలుగు వారాల బెయిల్​.. గతేడాది డిసెంబర్​లోనే పూర్తయిందని ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ సలహాదారు షాజాద్​ అక్బర్​ వెల్లడించారు. అందువల్లే షరీఫ్​ను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్టు షాజాద్​ వ్యాఖ్యానించారని డాన్​ వార్తా పత్రిక పేర్కొంది.

పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్​ చికిత్స కోసం బెయిల్​పై లండన్​ వెళ్లారు. ఈ క్రమంలో చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికను సమర్పించాలని లాహోర్​ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నివేదికను సమర్పించారు షరీఫ్​ తరఫు న్యాయవాదులు. అయితే తనకు బీపీ, కిడ్నీ, మధుమేహం సమస్యలు ఉన్నాయని.. కరోనా వైరస్​ నేపథ్యంలో బయటకు రావొద్దని వైద్యులు సూచించినట్టు కోర్టుకు విన్నవించారు షరీఫ్​.

అయితే.. తన కుమారుడు హస్సన్​ నవాజ్​తో లండన్​ వీధుల్లో షరీఫ్​ గొడుగు పట్టుకుని తిరుగుతున్న ఓ ఫొటో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. దీంతో పాక్​ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురైంది.

షరీఫ్​ను వెనక్కి రప్పించే ప్రక్రియను నేషనల్​ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్​ఏబీ)కు అప్పగించే అవకాశముందని షాజాద్​ పేర్కొన్నారు. ఈ పూర్తి వ్యవహారాన్ని ఈ ఏడాది మార్చిలోనే బ్రిటన్​ ప్రభుత్వానికి తెలియజేసినట్టు తెలిపిన షాజాద్​.. షరీఫ్​ను అప్పగించాలని కోరినట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి- కరోనా వేళ పాకిస్థాన్​కు తిరిగి రాలేను: షరీఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.