ETV Bharat / international

'సముద్ర గర్భం నుంచి క్షిపణి పరీక్షకు కొరియా ప్రణాళిక' - korea news

సముద్ర గర్భం నుంచి జలాంతర్గాముల ద్వారా త్వరలోనే బాలిస్టిక్​ క్షిపణిని ఉత్తరకొరియా పరీక్షించనుందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఏడాదిలోపే ఈ ప్రయోగం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

underwater-launched missile test
'సముద్ర గర్భం నుంచి క్షిపణి పరీక్షకు కొరియా ప్రణాళిక'
author img

By

Published : Sep 16, 2020, 10:10 PM IST

క్షిపణుల ప్రయోగాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా.. ఈసారి మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించే తొలి బాలిస్టిక్​ క్షిపణిని త్వరలోనే పరీక్షించనుందని దక్షిణ కొరియా సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఏడాదిలోపే ఈ పరీక్ష చేపట్టే అవకాశం ఉందన్నారు. అమెరికాతో అణ్వాయుధ చర్చలు నిలిచిపోయిన క్రమంలో దూకుడు పెంచుతోందన్నారు.

ఈ అంశాన్ని చట్టసభ్యులకు రాతపూర్వకంగా తెలియజేశారు దక్షిణ కొరియా సంయుక్త చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ నామినీ వాన్​ ఇన్​ చౌల్​.

"ఇటీవల తుపాను ధాటికి ధ్వంసమైన జలాంతర్గాములను తయారు చేసే సిన్పో షిప్​యార్డ్​ను ఉత్తరకొరియా బాగుచేస్తోంది. దానిని పూర్తిస్థాయిలో బాగుచేసిన వెనువెంటనే జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ క్షిపణులను పరీక్షించే అవకాశం ఉంది. అక్కడి పరిణామాలను దక్షిణకొరియా సైన్యం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది."

- వాన్​ ఇన్​ చౌల్​, దక్షిణకొరియా సంయుక్త చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ నామినీ.

కొన్ని సంవత్సరాలుగా జలాంతర్గాముల నుంచి ప్రయోగించే క్షిపణుల సామర్థ్యాన్ని సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఉత్తరకొరియా. గత ఏడాది అక్టోబర్​లో తొలిసారి ఇలాంటి మిసైల్​ను పరీక్షించింది.

ఇదీ చూడండి: నెలలోపే అమెరికాకు వ్యాక్సిన్‌: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.