అప్పుల ఊబిలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మానవతా దృక్పథంతో సాయం అందించింది. 118 ప్రాజెక్టుల కోసం 123 మిలియన్ డాలర్ల(రూ.903 కోట్లు)ను ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ పర్యటన సందర్భంగా ఈ సాయంపై ప్రకటన చేసింది.
యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో జరిగిన సమావేశంలో ఇరుదేశాల మధ్య ఆర్థిక, వర్తక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగినట్లు సౌదీ అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఈ సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆహార భద్రత, విద్య, వైద్యం, నీటి వసతులు, పర్యావరణ పారిశుద్ధ్యం వంటి రంగాల్లోని ప్రాజెక్టులకు ఈ నిధుల్ని వినియోగించనున్నట్లు తెలిపారు. కరోనాపై పోరాడేందుకు 1.5 మిలియన్ డాలర్ల(11 కోట్లు) విలువైన వైద్య పరికరాలను పాకిస్థాన్‌కు ఇప్పటికే పంపించినట్లు చెప్పారు.
భారత్ ప్రస్తావన
చర్చల తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత్ గురించి ప్రస్తావించాయి ఇరు దేశాలు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూ.చ తప్పకుండా పాటించాలని అంగీకారానికి రావడాన్ని గుర్తు చేశాయి. జమ్ము కశ్మీర్ సహా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: