ETV Bharat / international

రష్యాలో 5 లక్షలు దాటిన కరోనా బాధితులు - ప్రపంచంలో కరోనా కేసులు

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 75 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. రష్యాలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

Russia's coronavirus cases surpass 500,000
రష్యాలో 5 లక్షలు దాటిన కరోనా బాధితులు
author img

By

Published : Jun 11, 2020, 10:21 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాటికి 75 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు సంఖ్య 4లక్షల 20 వేలకు చేరుకున్నాయి.

Russia's coronavirus cases surpass 500,000
కరోనా కేసుల వివరాలు

అమెరికాలో మరో 3,572 కేసులు

అమెరికాలో తాజాగా 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితులు సంఖ్య 20 లక్షల 70 వేలకు చేరువైంది. మరో 113 మంది మృతి చెందగా.. ఫలితంగా లక్షా 15 వేల 243 మంది మృత్యువాతపడ్డారు.

రష్యాలో 8 వేల కేసులు

రష్యాలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8,779 మంది వైరస్ సోకింది. ఫలితంగా వైరస్​ బాధితుల సంఖ్య 5,02,436కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6 వేల 532 మంది మహమ్మారికి బలయ్యారు.

అత్యధిక కేసులు

పాకిస్థాన్​లో రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 5,834 మంది మృతికి వైరస్​ సోకింది. ఒకరోజు ఇన్ని కేసులు నమోదవ్వటం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో మరో 101 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 19 వేలు దాటింది. వీరిలో 78,789 మంది చికిత్స పొందుతుండగా.. మరో 38,391 మంది కోలుకున్నారు.

నేపాల్​లో 250 కేసులు..

నేపాల్​లోనూ వైరస్​ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 250మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,614కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 15కు చేరింది. అయినప్పటికీ కరోనా ఉద్ధృతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్​డౌన్​ను సడలించాలని ఆలోచనలో ఉంది నేపాల్​. దీనిపై శుక్రవారం అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చైనాలో మరో 16 కేసులు...

చైనాలో మళ్లీ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. తాజాగా మరో 16 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ అధికారుల వెల్లడించారు. 56 రోజుల తర్వాత ఆ దేశ రాజధాని బీజింగ్​లో తొలి కరోనా కేసు నమోదైనట్లు తెలిపారు. వీటితో కలిపి మొత్తం కేసులు సంఖ్య 83,057కు ఎగబాకింది. వీరిలో 60 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 4,634 మంది వైరస్​కు బలయ్యారు.

సింగపూర్​లో 422 కేసులు..

సింగపూర్​​లోనూ వైరస్​ విజృభిస్తోంది. గడిచిన 24గంటల్లో 422 మందికి కరోనా సోకింది. వీరిలో 421 మంది విదేశీ కార్మికులని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,387కు ఎగబాకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 25కు చేరింది.

మెక్సికోలో 4,883 కేసులు

మెక్సికోలో తాజాగా 4,883 కేసులు నమోదైనట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 708 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 15,357కు ఎగబాకింది. దేశ వ్యాప్తంగా 1,29,184 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 90 వేల మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

దక్షిణ కొరియాలో 45 కేసులు

దక్షిణ కొరియా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 45 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 21 సియోల్​ నగరంలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 11,947కు చేరింది. డోర్​ టూ డోర్​ డెలివరీ చేస్తున్న వారి నుంచి కేసులు నమోదవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా బాధితులకు ఇచ్చే డ్రగ్స్​పై పరిమితులు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.