ETV Bharat / international

రాజధానే లక్ష్యం- ఏ క్షణమైనా రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్ - ఉక్రెయిన్​ వార్తలు

Russia attack Ukraine: ఉక్రెయిన్ రాజధాని కీవ్​ వైపు రష్యా సేనలు దూసుకెళ్తున్నాయి. ఏ క్షణంలోనైనా నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఆ దేశం దాడులు ఆపేంతవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

Russia Ukraine war
రాజధానే లక్ష్యం- ఏ క్షణమైనా రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్
author img

By

Published : Feb 25, 2022, 12:26 PM IST

Updated : Feb 25, 2022, 12:49 PM IST

Russia Ukraine War: రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి.. చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు మేం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.

Russia Ukraine News

రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని జెలెన్‌ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని, కానీ అలాంటిది ఏమీ జరగలేదని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలామని అన్నారు. సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తున్నామని రష్యా చెబుతున్నా.. పౌరులపైనా దాడులు జరుగుతన్నాయని తెలిపారు. తాను రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా తాను ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు.

"నేను రాజధాని కీవ్‌ను విడిచిపెట్టినట్లుగా అనేక నకిలీ వార్తలు వస్తున్నాయని నాకు తెలుసు. అలాంటిదేమీ లేదు. నేను నా దేశ ప్రజలతో కలిసి రాజధానిలోనే ఉన్నాను. నేను మా భాగస్వామ దేశాలన్నింటినీ అడుగుతున్నాను. మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? ఒకవేళ ఉన్నాం అనే సమాధానమిస్తే మమ్మల్ని నాటో కూటమిలోకి తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు. మా దేశ భద్రత హామీల గురించి మాట్లాడేందుకు మేము భయపడం. మా దేశ రక్షణ మాటేమిటి? ఆ హామీని ఏ దేశాలు మాకు అందిస్తాయి అనేదే చూస్తున్నాం."

-జెలెన్‌ స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

Russia declares war on ukraine

కీవ్​కు 20మైళ్ల దూరంలో రష్యా సేనలు

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా దూకుడుగా మున్ముందుకు వెళ్తోంది. దేశ సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించిన రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కీవ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కర్మగారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం రష్యా సేనలు కీవ్‌ నగరానికి కేవలం 20 మైళ్ల(32 కిలోమీటర్లు) దూరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రధానంగా కీవ్‌ నగరంపైనే గురి పెట్టిందని, అందుకు తగ్గట్లుగానే నలువైపుల నుంచి నగరం వైపునకు దూసుకొస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏ క్షణమైనా రాజధానిని హస్తగతం చేసుకుని ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రమాదం ఉందని తెలిపాయి.

Russia Ukraine Crisis News

స్నేక్ ఐల్యాండ్ రష్యా వశం..

ఉక్రెయిన్​పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. నల్ల సముద్రంలోని ఉక్రెయిన్​కు చెందిన స్నేక్ ద్వీపాన్ని రష్యా దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ద్వీపంలో ఉన్న 13 మంది ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ లొంగిపోయేందుకు నిరాకరించారు. దీంతో రష్యా సైనికులు వారిని చంపేసినట్లు అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రకటించారు.

Russia ukraine conflict

రష్యా యుద్ధ విమానం కూల్చివేత..

Russia Ukraine war
రష్యా యుద్ధ విమానాన్ని కూల్చిన ఉక్రెయిన్​ బలగాలు

మరోవైపు రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. గురువారం రాత్రి రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్‌ కూల్చివేసినట్లు తెలిసింది. అయితే ఆ విమానానికి చెందిన శకలాలు కీవ్‌లోని రెండు నివాస భవనాలపై పడ్డాయి. దీంతో ఆ భవనాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు.

నాటో కూటమి సమావేశం..

మరోవైపు ఉక్రెయిన్‌లోని తాజా ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు నాటో కూటమికి చెందిన 30 మంది నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే వర్చువల్‌గా జరిగే ఈ సమావేశానికి అమెరికా, కెనడా, టర్కీ దేశాల నేతలు హాజరుకావట్లేదని సమాచారం.

ఆంక్షలతో రష్యా ఏకాకి..

  • యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా మిత్రదేశాలు రష్యాపై విధిస్తున్న కఠిన ఆర్థిక ఆంక్షల కారణంగా ఆ దేశం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏకాకి అవుతుందని శ్వేతసౌధం అధికారి తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను కూడా రష్యాకు దూరం చేస్తామన్నారు. అగ్రరాజ్యంతో పాటు ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలు.. ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్​పై ఆగ్రహంగా ఉన్నాయి. ఆంక్షలతో తమ సందేశాన్ని పంపుతున్నాయి.
  • ఈ నెల మొదట్లో మాస్కోలోని అమెరికా దౌత్యవేత్తను రష్యా బహిష్కరించినందుకు ప్రతీకారంగా వాషింగ్టన్‌లోని రష్యా రెండో ర్యాంక్ దౌత్యవేత్తను అగ్రరాజ్యం బహిష్కరించింది. విదేశాంగ శాఖ సీనియర్ అధికారి గురువారం ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఉక్రెయిన్​-రష్యా యుద్ధానికి దీనికి సంబంధంలేదని పేర్కొన్నారు.
  • రష్యా దాడి నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైంశకర్​కు ఫోన్ చేశారు. రష్యా చర్యను ఖండించాలని, దీన్ని వ్యతిరేకిస్తున్న దేశాలు ఐక్యంగా ఉండాలని బ్లింకెన్​ సూచించినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం..

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో(యూఎన్ఎస్​సీ) తీర్మానానికి శుక్రవారం ఓటింగ్​ జరగనుంది. అమెరికా, అల్బేనియా దీన్ని ప్రవేశపెట్టనున్నాయి. యూఎన్​ఎస్​సీలో వీటో అధికారం ఉన్న రష్యాను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసే ఉద్దేశంతో దీనిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 25, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.