సినిమాలో ఓ సన్నివేశం చిత్రీకరించేందుకు అంతరిక్షంలోకి వెళ్లిన రష్యా హీరోయిన్, డైరెక్టర్ క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మూడున్నర గంటలు ప్రయాణించి క్యాప్సుల్ సాయంతో ఆదివారం ఉదయం భూమి మీద దిగారు.
ఛాలెంజ్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఓ సీన్ కోసం హీరోయిన్ పెరిసిల్ద్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకో అక్టోబర్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. వీరితో పాటు చిత్రంలో ఓ పాత్రలో నటిస్తున్న నోవిట్స్కీ కూడా రోదసిలోకి వెళ్లి వచ్చారు. అంతరిక్షం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వ్యోమగామికి సర్జరీ చేసేందుకు హీరోయిన్ స్పేస్‌కు వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అంతరిక్షంలోనే 12 రోజుల పాటు శ్రమించి షూటింగ్ పూర్తి చేశారు.
షూటింగ్ అనంతరం స్పేస్ నుంచి క్యాప్సుల్ ద్వారా చిత్ర బృందం భూమికి చేరుకుంది. భూ వాతావరణంలోకి రాగానే పారాచూట్ సాయంతో వీరు కిందకు దిగారు. అనుకున్న సమయానికి కజకిస్థాన్‌లో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నప్పటికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
భూమికి సురక్షితంగా చేరుకున్న హీరోయిన్‌కు జర్నలిస్టులు పుష్పగుచ్చాలిచ్చి సాదర స్వాగతం పలికారు. ఆమె కూడా ట్రిప్ విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంతో నవ్వులు చిందించింది.
ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం దాదాపు 3 నెలల పాటు వ్యోమగామి ఆధ్వర్యంలో కఠిన శిక్ష తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: స్పేస్‌లో సినిమా షూటింగ్.. రాకెట్లో వెళ్లిన డైరెక్టర్, హీరోయిన్