ETV Bharat / international

Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్​లోనే భారతీయ విద్యార్థి - భారతీయ విద్యార్థి శునకం

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధంతో ఏర్పడిన భీతావహ పరిస్థితుల్లోనూ పెంపుడు శునకంపై ప్రేమను చాటుకుంటున్నాడు ఓ భారతీయ విద్యార్థి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తన కుటుంబసభ్యులు ఆ దేశాన్ని విడిచిపెట్టినా.. తాను మాత్రం కదల్లేదు. శునకం కోసం రణరంగంలోనే ఉండిపోయాడు! అక్కడి నుంచి వెళితే దానితోనే అంటున్నాడు.

Russia Ukraine War
ఉక్రెయిన్
author img

By

Published : Feb 26, 2022, 2:18 PM IST

శునకం కోసం ఉక్రెయిన్​లోనే ఉండిపోయిన భారతీయ విద్యార్థి

Russia Ukraine War: భీకర బాంబు దాడులు.. చావు కేకలు.. ఆకలి బాధలు. ఉక్రెయిన్​లో ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో పెంపుడు శునకంపై ఓ భారతీయ విద్యార్థి చూపిస్తోన్న ప్రేమ ఉద్వేగానికి గురిచేస్తోంది. ప్రాణభయంతో తన కుటుంబసభ్యులు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళుతున్నా.. తన శునకాన్ని వదిలి అక్కడి నుంచి కదలేకపోయాడు రిషభ్​ కౌశిక్​. దానిని తన వెంటే తీసుకెళ్లేందుకు అనుమతుల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

భారత్​కు వెళితే శునకంతోనే..

ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​కు చెందిన రిషభ్​ కౌశిక్​.. మూడేళ్లుగా ఉక్రెయిన్​లోని ఖార్కీవ్​లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన కుటుంబసభ్యులు ఆ దేశంలోనే వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్​పై రష్యా యుద్ధ ప్రకటనతో వారి జీవితాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి.

పరిస్థితులు హింసాత్మకంగా మారతాయనే భయంతో కుటుంబంలోని ఏడుగురు టికెట్లు బుక్​ చేసుకొని దుబాయ్​ వెళ్లిపోయారు. రిషభ్ మాత్రం అక్కడే ఉన్నాడు. యుద్ధం కారణంగా ఛిద్రమవుతున్న దేశంలో దానిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడానికి అతడికి మనసు రాలేదు. శునకాన్ని తీసుకెళ్లేందుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్న అతడికి భారత అధికారుల నుంచి సహకారం లేదని వాపోతున్నాడు.

Russia Ukraine War
రిషభ్​ కౌశిక్​

"ఫిబ్రవరి 18 నుంచి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా. దిల్లీలోని ఏక్యూసీఎస్​ (యానిమల్ క్వారంటైన్, సర్టిఫికేషన్​ సర్వీస్)ను కాంటాక్ట్​ చేస్తున్నా. నా పాస్​పోర్ట్​, శునకం పాస్​పోర్ట్​, మా డాక్యుమెంట్స్​ అన్నీంటినీ మెయిల్​ చేశాను. అయినా మరిన్ని పత్రాల కోసం అడుగుతూనే ఉన్నారు. ఉక్రెయిన్​లో అన్నీ మూతపడ్డాయి. ఔషధాలు, ఫుడ్​ స్టోర్​లు, సరఫరా వ్యవస్థల వద్ద నీరు, ఆహార కొరత ఏర్పడింది. కీవ్​లోని ఇండియన్​ ఎంబసీని సంప్రదించినా.. వారు భారత ఏక్యూసీఎస్ సెంటర్​ను కాంటాక్ట్​ కావాలని చెబుతున్నారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ వ్యక్తిని సంప్రదిస్తే.. అమార్యదగా మాట్లాడారు. ఎవరూ ఏమీ చేయడం లేదు."

- రిషభ్​ కౌశిక్​, ఉక్రెయిన్​లో భారతీయ విద్యార్థి

చేయగలిగిన సహాయం చేయండి..

భారత ప్రభుత్వం వారి నిబంధనల ప్రకారం ఎన్​ఓసీ ఇచ్చి ఉంటే తాను ఈపాటికి భారత్​లో ఉండేవాడినని అన్నాడు రిషభ్. "ఏక్యూసీఎస్​కు అన్ని వివరాలు ఇచ్చాను. నాది రెస్క్యూ శునకం (పాత యజమాని వేధింపులకు గురై, విడిచి పెట్టినది) అని కూడా చెప్పాను. కానీ, సహకారం అందించేందుకు వారు సిద్ధంగా లేరు. ఇక్కడ జరిగే బాంబు దాడులకు శునకం బెదిరిపోయింది. భారత ప్రభుత్వం వల్ల వీలైన సహాయం చేయాలని కోరుతున్నా." అని పేర్కొన్నాడు రిషభ్ కౌశిక్.

ఇప్పడు వదిలేస్తే.. ఇదే చివరిచూపు!

ఉక్రెయిన్​లో ఏర్పడిన భీకర పరిస్థితుల్లోనూ శునకాన్ని విడిచిపెట్టి రావడం కష్టమేనని అన్నాడు రిషభ్. "ఇప్పటికే నాలుగైదు రోజులు ఎదురు చూశాను. దీనిపై అధికారులు ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. నేను వదిలేసి వెళ్లిపోతే దీనిని ఎవరు చూసుకుంటారు? ఆహారం, నీరు లేక జనం అలమటిస్తున్నారు. అలాంటిది దీనికెవరు తిండి పెడతారు? ఇప్పుడు దీనిని నేను వదిలేస్తే మళ్లీ జన్మలో చూడలేను." అని అన్నాడు రిషభ్.

ఉక్రెయిన్​లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మందిని తరలించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

ఇవీ చూడండి:

'అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి'.. ఉక్రెయిన్​ సైన్యానికి పుతిన్‌ పిలుపు

రష్యా చేతికి ఉక్రెయిన్​ ఎయిర్​పోర్ట్​- 1000 మంది సైనికులు మృతి

'తప్పు చేస్తోన్న రష్యా.. బలయ్యేది అమాయక ప్రజలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.