కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఆ దిశగా పలు దేశాల్లో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 12న తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.
ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న టీకాను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఒలెగ్ గ్రిడ్నేవ్.
" గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ ఆగస్టు 12న విడుదల చేయనున్నాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ట్రయల్స్ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం."
- ఒలెగ్ గ్రిడ్నేవ్, ఆరోగ్య శాఖ సహాయమంత్రి
గమలేయా రూపొందిస్తోన్న టీకా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయి. 38 మంది వలంటీర్లపై ప్రయోగించారు. వారందరిలో కరోనా ప్రతిరోధక శక్తి ఏర్పడినట్లు గుర్తించారు. జులై 15న తొలి బృందం, జులై 20న రెండో బృందం డిశ్చార్జి అయ్యారు.
ఇదీ చూడండి: కొవిడ్ నుంచి ఎలుకలను రక్షించిన మోడెర్నా టీకా