ETV Bharat / international

ఆ దేశాల్లో మళ్లీ కరోనా ఉద్ధృతి- భయాందోళనలో ప్రజలు - కరోనా మృతుల సంఖ్య

కరోనా ధాటికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. అనేక చోట్ల వైరస్​ మళ్లీ విజృంభిస్తుండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో రికార్డు స్థాయిలో కేసులు బయటపడగా.. ఇరాన్​లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్​, జర్మనీలోనూ వైరస్​ ఉద్ధృతి పెరిగింది.

Russia sets daily infection record: Over 14,230 new cases
ఆ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ- భయాందోళనలో ప్రజలు
author img

By

Published : Oct 14, 2020, 7:43 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.​ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3కోట్ల 84 లక్షల 49వేల 649 కేసులు నమోదయ్యాయి. 10లక్షల 92వేల 252మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 2కోట్ల 88లక్షల 94వేల 655మంది కరోనాను జయించారు.

ఈ ఏడాది తొలినాళ్లలో వైరస్ ధాటికి గడగడలాడిన దేశాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రష్యా, ఇరాన్​, బ్రిటన్​లో రికార్డు స్థాయిలో వైరస్​ కేసులు నమోదవుతున్నాయి.

రష్యాలో...

రష్యాలో తాజాగా 14,230కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కరోనా విజృంభించినప్పటి నుంచి ఇవే ఒక్కరోజులో అత్యధిక కేసులని అధికారులు వెల్లడించారు. దేశంలో వరుసగా 11వ రోజు 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 13లక్షల 40వేల 409మందికి వైరస్​ సోకింది. 23వేల 205మంది మరణించారు.

ఇదీ చూడండి:- 'కరోనా నుంచి కోలుకుంటే.. ఐదు నెలలు సేఫ్​!​'

ఇరాన్​లో...

ఇరాన్​లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. వారంలో వరుసగా మూడోసారి.. రికార్డు స్థాయిలో కరోనా మరణాలు వెలుగుచూశాయి. తాజాగా 279మంది మరణించారు. 4,830మందికి వైరస్​ సోకింది.

దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5లక్షల 13వేల 219కి చేరగా.. మరణాల సంఖ్య 29వేల 349కి పెరిగింది.

బ్రిటన్​లో..

బ్రిటన్​లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా తాత్కాలిక లాక్​డౌన్​ విధించినా బ్రిటన్​లో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 34వేల 920కి చేరింది. ఇప్పటివరకు 43,018 మరణాలు నమోదయ్యాయి.

జర్మనీలో..

జర్మనీలో తాజాగా 5వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఏప్రిల్​ మధ్య వారం తర్వాత ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. దీంతో 16రాష్ట్రాల గవర్నర్లతో బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​. కరోనా కట్టడి వ్యూహాలను చర్చించారు.

ఇదీ చూడండి:- నన్ను క్షమించండి అంటూ 'కిమ్​' కన్నీరు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.