అఫ్గాన్‌లో మినీ వ్యాన్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు లెక్చరర్లు మృతిచెందారు. 11 మంది విద్యార్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉత్తర కపీసా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
దాడిలో దుండగులు రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బాంబు అమర్చినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. అల్బరోని యూనివర్సిటీ వైపుగా వెళ్తుండగా వ్యాన్‌పై దాడి జరిగినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారకులెవరనేదానిపై స్పష్టత రాలేదు.
గతంలో పలుమార్లు కాబుల్ యూనివర్సిటీపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వారు ఇదే తరహాలో బాంబు దాడికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి:చైనా కమ్యునిస్టు పార్టీ 'వందేళ్ల' వేడుకలు