ETV Bharat / international

చైనా గబ్బిలాల్లో 24 కొత్త రకం కరోనా వైరస్​లు - కరోనావైరస్ చైనా గబ్బిలాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు. గబ్బిలాల్లో 24 కొత్త రకం కరోనా వైరస్​లను గుర్తించారు. చిన్న ప్రదేశంలోనే ఇన్ని రకాల వైరస్​లు బయటపడటం పట్ల శాస్త్రవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఆవిర్భావాన్ని గుర్తించడం మరింత క్లిష్టతరం కానుందని చెబుతున్నారు.

Research team locates 24 bat coronaviruses in southwestern China
చైనా గబ్బిలాల్లో 24 కొత్త రకం కరోనావైరస్​లు
author img

By

Published : Mar 15, 2021, 11:05 AM IST

కరోనా ఆవిర్భావంపై పరిశోధన సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు.. గబ్బిలాలలో 24 కొత్త రకం కరోనా వైరస్​లను గుర్తించారు. వీటన్నింటినీ నైరుతి చైనాలో 4 కి.మీ పరిధిలోనే కనుగొన్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఇందులో నాలుగు వైరస్​లు కొవిడ్​-19కు కారణమయ్యే స్ట్రెయిన్​కు సంబంధించినవని పేర్కొంది. ఓ వైరస్​ రకం.. 'సార్స్-కోవ్-2'ను పోలిన జన్యువును కలిగి ఉందని తెలిపింది. అయితే, ప్రస్తుత మహమ్మారికి ఇవేవీ ప్రత్యక్ష మూలాలు కాకపోవచ్చని వివరించింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను ప్రస్తావించింది.

తాజా పరిశోధనకు షాండోంగ్ ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షి వెయిఫోంగ్ నేతృత్వం వహించారు. ఆర్​పీవైఎన్06 అనే ఓ వైరస్​కు.. సార్స్-కోవ్-2కు 94.5 శాతం పోలికలు ఉన్నాయని వీరు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం యున్నాన్​లో కనుగొన్న ఆర్ఎటీజీ13 అనే వైరస్.. సార్స్​ వైరస్​కు 96 శాతం పోలి ఉందని తెలిపారు. 'దీని బట్టి... సార్క్-కోవ్-2 మూలాలు.. ఆర్​పీవైఎన్06, ఆర్ఎటీజీ13 నుంచి దశాబ్దాల క్రితమే వేరువడి ఇతర జాతులతో కలిశాయని స్పష్టమవుతోంది' అని పరిశోధకులు పేర్కొన్నారు. ఇంత చిన్న ప్రదేశంలో అన్ని రకాల వైరస్ జాతులను గుర్తించడం ఊహించని విషయమని అన్నారు. దీనివల్ల సార్స్-కోవ్-2 వైరస్ ఆవిర్భావంపై ఉన్న చిక్కుముళ్లను పరిష్కరించడం మరింత కఠినతరం కానుందని పేర్కొన్నారు.

కొత్త వేరియంట్లు..

కొత్త వైరస్​లలో చాలా వరకు ఉష్ణమండల ప్రాంతాల్లోనే బయటపడ్డట్లు షాంఘైకి చెందిన ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారు. వైరస్​లు... ఇతర వైరస్​లతో కలిసి కొత్త వేరియంట్​ ఏర్పడేందుకు అక్కడి వేడి వాతావరణం, సమృద్ధిగా ఉండే జంతు జాతులు తోడ్పడినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: జలాశయంలో మునిగి ఐదుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.