ETV Bharat / international

అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్- 8 మంది మృతి - Gas explosion death toll in china

Gas explosion
పేలిన సిలిండర్​
author img

By

Published : Sep 11, 2021, 10:42 AM IST

Updated : Sep 11, 2021, 11:36 AM IST

10:34 September 11

అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్- 8 మంది మృతి

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్​మెంట్​ బిల్డింగ్​లో గ్యాస్​ సిలిండర్​ పేలిన(China Explosion) ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. డాలియన్ గరంలోని పులందియన్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక  సిబ్బంది.. ఉదయం 2:30 గంటల సమయంలో మంటలను ఆర్పేశారు.

క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ 'జిన్హువా' ఓ కథనంలో తెలిపింది. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పింది. భవనంలో ఉన్న మిగతా వారిని ఖాళీ చేయించారని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.  

Last Updated : Sep 11, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.