సోమవారం నెలవంక దర్శనంతో రంజాన్ మాసం ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభించారు ముస్లింలు.
పాకిస్థాన్‌లో వేల సంఖ్యలో
పాకిస్థాన్‌లో రంజాన్ నెలారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది ముస్లింలు సోమవారం అర్థరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జోర్డాన్, యెమెన్‌లో ఇఫ్తార్ విందు
జోర్డాన్, యెమెన్ దేశాల్లోని పేద ముస్లిం కుటుంబాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేయూతగా నిలిచాయి. రంజాన్ నెలారంభం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాయి. విందుతో పాటు ఇస్లాంమత పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను బహుమతిగా అందజేశారు. దుప్పట్లు, పరుపులు ఉచితంగా పంపిణీ చేశారు.
సూడాన్‌లో నిరసనల మధ్యే వేడుకలు
సూడాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతన్నప్పటికీ ముస్లింలు రంజాన్ సంబరాల్లో పాల్గొన్నారు. మసీదుల్లో అర్థరాత్రి నుంచే నమాజ్‌లు నిర్వహించారు.
నెలమొత్తం నిష్ఠగా ఉపవాసాలు
ముస్లింలు రంజాన్ మాసమంతా దానధర్మాలు, ఇఫ్తార్‌లతో ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. పగలు మంచినీరైనా తాగకుండా నిష్ఠగా ఉపవాస దీక్ష ఆచరిస్తారు.
ఇదీ చూడండి : మోదీపై కంప్యూటర్ బాబా నిప్పులు..!