ETV Bharat / international

రష్యాలో రాజ్​నాథ్​తో చైనా రక్షణ మంత్రి భేటీ! - భారత్ చైనా వివాదం

తూర్పు లద్దాఖ్​ ఉద్రిక్తతల నడుమ భారత్, చైనా రక్షణ మంత్రులు శుక్రవారం భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షాంఘై సహకార సంస్థ మంత్రుల సమావేశం కోసం రాజ్​నాథ్​ సింగ్​, వీ ఫెంగీ మాస్కోలో పర్యటిస్తున్నారు. మాస్కోలోనే రాజ్​నాథ్​తో భేటీ నిర్వహించాలని భారత్​ను చైనా ముందుగా కోరినట్లు తెలుస్తోంది.

SINOINDIA MEET
భారత్, చైనా
author img

By

Published : Sep 4, 2020, 1:23 PM IST

చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీతో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉంది. షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు కోసం మాస్కో వెళ్లారు రాజ్​నాథ్​. ఇదే వేదికగా ఫెంగీతో భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు సమాచారం.

లద్దాఖ్​లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న వేళ.. రాజ్​నాథ్​​తో భేటీ కోసం చైనా ఫెంగీ సుముఖంగా ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. రాజ్​నాథ్​తో సమావేశం ఏర్పాటు చేయాలని చైనానే కోరినట్లు సమాచారం. ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశం కావాలనే తన అభీష్టాన్ని చైనా.. భారత అధికారుల​కు తెలియజేసినట్లు తెలుస్తోంది.

అత్యున్నత భేటీ..

భారత్​- చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి తొలి అత్యున్నత భేటీ ఇదే కానుంది. ఇంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్​, చైనా తరఫున వాంగ్​ యీ ఫోన్​లో సంభాషించారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు వెళ్లారు రాజ్​నాథ్​. ఎస్​సీఓ సదస్సుతో పాటు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అయితే.. రాజ్​నాథ్​ షెడ్యూల్​లో చైనా రక్షణ మంత్రితో భేటీ లేదు.

ఇదీ చూడండి: రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.