ETV Bharat / international

ఇజ్రాయెల్​లో మళ్లీ లాక్​డౌన్- సింగపూర్​లో సడలింపు​ - కరోనా కేసుల న్యూస్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇజ్రాయెల్​ రెండోసారి లాక్​డౌన్​ విధించనుంది. స్విట్జర్లాండ్​లో 2500 మంది విద్యార్థులను నిర్బంధంలోకి వెళ్లాలని ఆ దేశ వైద్యాధికారుల ఆదేశించారు. సింగపూర్ మాత్రం​ లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తోంది.

Quarantine ordered for 2,500 students at elite Swiss school
ఇజ్రాయెల్​ రెండోసారి లాక్​డౌన్-సింగపూర్​లో సడలింపు​
author img

By

Published : Sep 24, 2020, 8:15 PM IST

ప్రపంచదేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో పలు దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్​ రెండోసారి వారం రోజులపాటు లాక్​డౌన్ విధించనుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

2500మంది నిర్బంధం!

స్విట్జర్లాండ్​లో లాసాన్​ నగరంలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 2,500 మంది విద్యార్థులను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆ దేశ వైద్యాధికారులు ఆదేశించారు.

సింగపూర్​లో సడలింపు..

సింగపూర్​లో వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. ప్రాంతీయ లేదా అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ల కోసం కొత్త బిజినెస్ ట్రావెల్ పాస్‌ను ప్రవేశపెట్టింది.

కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 21 లక్షల 67 వేలు దాటింది. ఇప్పటివరకు 9 లక్షల 83 వేల మందికి పైగా మృతి చెందారు. 2 కోట్ల 37 లక్షల 38 వేల మందికిపైగా కోలుకున్నారు. అమెరికా, భారత్,​ బ్రెజిల్​ దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.

ఇదీ చూడండి: నేపాల్​- చైనా మధ్య కీలక వాణిజ్య మార్గం పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.