Putin taxi driver news: అది 1991వ సంవత్సరం. సోవియట్ యూనియన్‌కు గడ్డుకాలం! పశ్చిమాన ఉన్న బాల్టిక్ నుంచి మధ్య ఆసియా వరకు ఎన్నో దేశాలు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేవి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది ఈ యూనియన్. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ లోలోపల.. ఆర్థిక సంక్షోభంతో యూనియన్ విలవిల్లాడిపోయింది. అప్పులు తీర్చలేని స్థితిలో పడిపోయింది. చివరికి.. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. యూనియన్‌లో కేంద్రబిందువుగా ఉన్న రష్యా.. చివరికి ఒంటరిగా మిగిలిపోయింది.
ఆ సమయంలో పుతిన్.. సోవియెట్ యూనియన్‌కు చెందిన కేజీబీ సెక్యూరిటీ సర్వీసెస్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఆయన ఓ నమ్మిన బంటు. సోవియట్ యూనియన్ విడిపోవడం వల్ల ఏర్పడిన సంక్షోభానికి.. సాధారణ ప్రజల్లానే.. ఆయన కూడా ఇబ్బందులు పడ్డారు.
"సోవియట్ యూనియన్ కుప్పకూలడం.. 20వ దశాబ్దానికే అతిపెద్ద భౌగోళిక రాజకీయ విపత్తు. ఆ వార్త విని నేను నమ్మలేకపోయాను. చారిత్రక రష్యాకు ఆ రోజుతో ముగింపు పడింది. అప్పట్లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి. నేను కొంత ఎక్కువ సంపాదించాల్సి వచ్చేది. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసిన రోజులూ ఉన్నాయి. వాటిని ఇప్పుడు గుర్తుతెచ్చుకోవడం కొంత అసహ్యకరంగా ఉంది. దురదృష్టవశాత్తు అప్పడు నాది ట్యాక్సీ నడుపుకోవాల్సిన పరిస్థితి."
-- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు.
Vladimir Putin news:
'రష్యా- రీసెంట్ హిస్టరీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఛానెల్ వన్ అనే సంస్థ. ఇందులో పుతిన్ మాట్లాడి.. నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలను రష్యా అధికారిక వార్తా సంస్థ ఆర్ఐఏ నొవోస్తి ఆదివారం ప్రచురించింది.
ఇదీ చూడండి:- పుతిన్ స్కెచ్ వేస్తే ప్రత్యర్థి ఎవరైనా గప్‌చుప్