ETV Bharat / international

కీలక రాజ్యాంగ సవరణలపై పుతిన్​ సంతకం - రష్యా వార్తలు

రష్యా అధ్యక్షుడిగా మరో రెండు దఫాలు తాను పోటీ చేసేందుకు వీలుగా ఇటీవల రాజ్యాంగంలో చేసిన సవరణలపై పుతిన్ సంతకం చేశారు​. 2024తో పుతిన్​ అధ్యక్ష పదవీకాలం ముగుస్తున్నప్పటికీ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేశారు.

Putin signs Russia constitutional reform law
రష్యా అధ్యక్షుడిగా మరో రెండు పర్యాయాలు పుతిన్​!
author img

By

Published : Mar 14, 2020, 11:15 PM IST

2024 తర్వాత కూడా తాను మరో రెండు దఫాలు అధ్యక్ష పదవికి పోటీచేయడానికి వీలు కల్పించే రాజ్యాంగ సవరణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ సంతకం చేశారు.

ఈ సంస్కరణలను వివరించే 68 పేజీల చట్టాన్ని ఆ దేశ అధ్యక్ష భవనం (క్రెమ్లిన్)​ అధికారిక వెబ్​సైట్​లో ఉంచింది. ఈ సవరణల కోసం పుతిన్​ సాధారణ చట్టాలకు భిన్నమైన మార్పులు చేశారు.

ప్రజామోదమే తరువాయి..

ఈ సంస్కరణలను రష్యన్​ రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తారు. అక్కడ వీటి ఆమోదముద్రకు వారం గడువుంటుంది. అనంతరం ఆ దేశ ప్రజలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికి​ ఏప్రిల్​ 22 న ఓటింగ్​ నిర్వహించనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది​.

కరోనా వైరస్​ గురించి ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. ఈ ఓటింగ్​ తప్పక జరుగుతుందని రష్యా సెనేట్​ స్పీకర్​ వాలెంటినా మాట్వియెంకో ధీమా వ్యక్తం చేశారు. క్రెమ్లిన్​... ఇంటర్నెట్​ ఓటింగ్​ నిర్వహిస్తుందని ఈ మధ్య ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకేనని విపక్షాలు విమర్శించాయి.

ఈ సవరణలు అధికార సమతుల్యతను ఏర్పరుస్తూ పార్లమెంట్​, అధ్యక్షుడికి అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి.

ఇదీ చదవండి: రష్యా అధ్యక్షునిగా కొనసాగేందుకు పుతిన్​కు లైన్​ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.