అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు బలగాలను(Afghan US Troops) కొనసాగించడం ద్వారా అమెరికా సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) విమర్శించారు.
'అఫ్గాన్‌లో 20 ఏళ్ల పాటు ఉన్న అమెరికా సైన్యం.. అక్కడ కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు ప్రయత్నించింది. ప్రజలకు తమలాంటి నాగరికతను నేర్పించేందుకు యత్నించింది. ఫలితం మాత్రం శూన్యం. ఏ ప్రాంత ప్రజలపైనైనాసరే బయటి విధానాలను రుద్దడం అసాధ్యం' అని పుతిన్ (Vladimir Putin) బుధవారం పేర్కొన్నారు.
తాలిబన్లతో బ్రిటన్ చర్చలు
ఇప్పటికీ అఫ్గానిస్థాన్‌లోనే(Afghanistan news) ఉన్న తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై బ్రిటన్ దృష్టిసారించింది. ఇన్నాళ్లూ తమకు సహకరించిన కొందరు అఫ్గానీలను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాలని కూడా యోచిస్తోంది. కతార్ రాజధాని దోహా వేదికగా తాలిబన్లతో బ్రిటన్ అధికారులు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.
ఇవీ చూడండి:
Afghanistan Biden: '20 ఏళ్లుగా యుద్ధం.. పొడిగించాలని లేదు'