ETV Bharat / international

విమాన ప్రమాదం దర్యాప్తుపై ఇమ్రాన్​ ఆగ్రహం - పాక్​ విమాన ప్రమాదం కాక్​పిట్​

పాకిస్థాన్​ విమాన ప్రమాదం దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూన్​ 22న ప్రాథమిక దర్యాప్తును పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్నట్టు పాక్​ విమానయానశాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు ఓ విదేశీ బృందం ఘటనాస్థలం నుంచి కాక్​పిట్​ను స్వాధీనం చేసుకుంది.

Preliminary probe report on PIA plane crash to be presented before parliament on June 22: Minister
విమాన ప్రమాదం దర్యాప్తుపై ఇమ్రాన్​ ఆగ్రహం
author img

By

Published : May 28, 2020, 8:28 PM IST

పాకిస్థాన్​లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తు తీరుపై ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు కనుగొనడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. దర్యాప్తులో వెలుగుచూసిన వాటిని ప్రజలతో పంచుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలో ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను జూన్​ 22న పార్లమెంట్​ ముందు ప్రవేశపెట్టనున్నట్టు పాక్​ విమానయానశాఖ మంత్రి ఘులామ్​ సర్వార్​ ఖాన్​ వెల్లడించారు. దర్యాప్తు స్వేఛ్చగా, పారదర్శకంగా జరుగుతుందన్నారు.

గత శుక్రవారం.. లాహోర్​ నుంచి కరాచీ వెళ్తున్న దేశీయ విమానం.. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని నివాసాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది మరణించారు. ఇద్దరు ప్రయాణికులు బయటపడ్డారు.

కాక్​పిట్​ స్వాధీనం...

మరోవైపు పాకిస్థాన్​ విమాన ప్రమాదం జరిగిన దాదాపు వారం రోజులకు.. శిథిలాల నుంచి కాక్​పిట్​ను స్వాధీనం చేసుకుంది ఓ విదేశీ బృందం.

ఎయిర్​బస్​ సంస్థ ప్రతినిధులతో సహా 11 మంది సభ్యుల బృందం.. గురువారం ఘటనాస్థలాన్ని సందర్శిచింది. ఐదు గంటలపాటు అన్వేషించిన అనంతరం కాక్​పిట్​ వాయిస్​ రికార్డ్​ను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో ఈ కాక్​పిట్​ కీలక పాత్ర పోషించనుంది.

దర్యాప్తు బృందం 26న కరాచీకి చేరుకుంది. రెండు రోజుల అనంతరం వెనుదిరగాల్సి ఉంది. కొన్ని కీలక ఆధారాలు లభించకపోవడం వల్ల తిరుగుప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. ఈ బృందంలో ఫ్రాన్స్​, జర్మనీ, బ్రిటన్​ సహా ఇతర దేశాలకు చెందిన సభ్యులు ఉన్నారు.

ఘటనాస్థలంలో ఫోరెన్సిక్​ పరీక్షలు నిర్వహించింది. కొన్ని విమాన భాగాలను సేకరించింది. అనంతరం విమానాశ్రయం లోపలికి వెళ్లి అక్కడి రాడార్​ వ్యవస్థ, విమాన్​ టేక్​ ఆఫ్​- ల్యాండింగ్​ వసతులను పరిశీలిచింది.

ఇదీ చూడండి:- పాక్‌ విమానం కూలకముందు ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.