ETV Bharat / international

గర్భిణీపై ఆస్పత్రి అధికారుల కర్కశం- రక్తస్రావమవుతున్నా... - చైనాలో లాక్​డౌన్​

Pregnant women not allowed to hospital: కరోనా మహమ్మారి.. మనుషుల్లో 'జాలి' అనే గుణాన్ని దెబ్బతీస్తోందనడానికి సాక్ష్యంగా నిలిచిన ఘటన ఇది. ఓ గర్భిణీ వద్ద కొవిడ్​ పరీక్ష ఫలితం లేదన్న కారణంతో.. ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై... చివరకు తన బిడ్డను పోగొట్టుకుంది.

pregnant women not allowed to hospital
చైనాలో గర్భిణీని ఆస్పత్రిలోకి అనుమతించని అధికారులు
author img

By

Published : Jan 6, 2022, 1:39 PM IST

Pregnant women not allowed to hospital: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత తరుణంలో.. వైద్యులే 'దేవుళ్లు'గా ప్రశంసలు అందుకుంటున్నారు. తమకు ప్రాణహాని ఉన్నా లెక్క చేయకుండా.. ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే... ఓ ఆస్పత్రిలోని వైద్యాధికారులు మాత్రం అమానుషంగా ప్రవర్తించారు. కొవిడ్ నిబంధనల పేరుతో గర్భిణీని ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఫలితంగా ఆమెకు గర్భస్రావమైంది. ఈ ఘటన చైనాలోని ఓ నగరంలో జరిగింది. దీనికి బాధ్యులైన ఆస్పత్రి అధికారులపై స్థానిక ప్రభుత్వం వేటు వేసింది.

అసలేం జరిగింది?

Covid rules in china: ఉత్తర చైనా నగరమైన షియాన్​లో గావోగ్జిన్ ఆస్పత్రికి నూతన సంవత్సరం రోజున తీవ్ర నొప్పులతో ఓ గర్భిణీ తన భర్తతో కలిసి వెళ్లింది. అయితే... కొవిడ్ పరీక్షల ఫలితాలు లేవన్న కారణంతో అధికారులు ఆమెను ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. నొప్పితో విలవిలాడిన ఆమె ఆస్పత్రి బయటే ఓ పింక్ ప్లాస్టిక్ స్టూల్​పై కూర్చుండిపోయింది. తీవ్ర రక్తస్రావమయ్యే వరకు ఆమెను అధికారులు ఆస్పత్రిలోకి అనుమతించలేదు. ఆమె భర్త తీసిన వీడియోలో.. ఆ మహిళ కాళ్ల వద్ద రక్తపు మడుగు కనిపించింది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా... షియాన్​ నగర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గావోగ్జిన్ ఆస్పత్రి జనరల్ మేనేజర్ ఫ్యాన్ యుహుహి సహా ఔట్ పేషంట్ విభాగం అధిపతులు, ఇతర వైద్య సిబ్బందిని విధుల నుంచి గురువారం సస్పెండ్ చేసింది. ఆస్పత్రి అధికారుల చర్యలు.. 'సమాజంలో విస్తృత ఆందోళన, సమాజంపై తీవ్ర ప్రభావం చూపగలవు' అని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆస్పత్రిని ఆదేశించామని చెప్పారు. బాధితురాలికి పరిహారంతో పాటు, తగిన వైద్య చికిత్స అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Lockdwon in china: ఆస్పత్రిలోని మొత్తం సిబ్బందిలో ఎంతమందిని విధుల నుంచి తప్పించారనే విషయంపై స్పష్టత లేదు. అయితే.. వారిని కరోనా వ్యాప్తి కట్టడిలో క్రమశిక్షణగా వ్యవహరించిన అధికారుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో... 1.3 కోట్ల జనాబా ఉన్న షియాన్ నగరంలో రెండు వారాలుగా కఠిన లాక్​డౌన్​ను అమలు చేస్తున్నారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ.. నిబంధనల్లో సడలింపుల ఇవ్వకపోవడం వల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది అక్కడి ప్రభుత్వం.

ఇదీ చూడండి: Lithuania Taiwan: 'చైనాను ఎదిరించావు.. నీకు అండగా నేనున్నాను!'

ఇదీ చూడండి: భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 13 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.