ETV Bharat / international

నేపాల్​ రాష్ట్రపతితో ఎన్​సీపీ అధ్యక్షుడు ప్రచండ భేటీ - nepal politics

నేపాల్​లో అధికార ఎన్​సీపీ పార్టీలో విభేదాల నేపథ్యంలో రాష్ట్రపతి బైద్యదేవీ భండారితో పార్టీ అధినేత ప్రచండ సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన అనంతరం ఈ భేటీ జరిగింది. పార్టీలో ప్రస్తుత పరిణామాలపై భండారి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Prachanda
ప్రచండ
author img

By

Published : Jul 3, 2020, 12:49 PM IST

నేపాల్ రాష్ట్రపతి బైద్యదేవి భండారితో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్​సీపీ) అధ్యక్షుడు పుష్పకమల్ దహల్ ప్రచండ గురువారం భేటీ అయ్యారు. కేబినెట్ సిఫార్సు మేరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ప్రారంభించిన అనంతరం ఈ భేటీ జరిగింది.

అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలు మొదలయ్యాయన్న వార్తల నడుమ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భండారి కూడా ఎన్​సీపీకి చెందిన మాజీ నాయకురాలే కావటం వల్ల తాజా పరిణామాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

అంతకుముందు రాష్ట్రపతి భండారితో ప్రధాని కేపీ శర్మ ఓలి గురువారం భేటీ అయ్యారు. కేబినెట్​ నిర్ణయానికి అనుగుణంగా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు ఓలి. ఇదే విషయంపై ప్రచండతోపాటు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దౌబాతో వేర్వేరుగా ఓలి సమావేశమయ్యారు.

రాజీనామాకు డిమాండ్..

అయితే ఓలి రాజీనామా డిమాండ్​పై పార్టీ అగ్రనేతలు ఏకాభిప్రాయానికి రాకపోవటం వల్ల ఎన్​సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగానూ సమర్థనీయం కాదని, ఓలి రాజీనామా చేయాలని ఎన్​సీపీ ముఖ్యనేతలు మంగళవారం డిమాండ్ చేశారు.

భారత్​పై వివాదాస్పద వ్యాఖ్యలు..

కాఠ్మాండులోని ఓ హోటల్‌లో తనను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కేపీ ఓలి ఇటీవల ఆరోపించారు. ఇందులో ఒక ఎంబసీ కీలకంగా వ్యవహరిస్తోందని భారత్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయం కుట్ర పన్నుతోందన్నారు. ఇటీవల నేపాల్‌ జాతీయ పటం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఓలి ఆరోపించారు.

ఇదీ చూడండి: నేపాల్ ప్రధానికి ఎందుకీ 'రాజీ'నామా కష్టం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.