ETV Bharat / international

నేపాల్​ దారెటు? భారత్​పై ప్రభావమెంత? - oli realignment with Monarchist forces expected

పార్లమెంట్ రద్దుతో నేపాల్.. రాజకీయ సంక్షోభంలో పడింది. అధికార వర్గ పోరు సుప్రీంకోర్టుకు చేరింది. ఇందులో వచ్చే ఫలితం.. నేపాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. అయితే.. తర్వాతి ఎన్నికల్లో ఆ దేశ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుంది? ఎవరు ఎవరితో పొత్తులు కుదుర్చుకుంటారు? కేపీ శర్మ ఓలి.. రాచరిక శక్తులతో కలుస్తారా? ఈ పరిణామాలు భారత్​పై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో పరిశీలిద్దాం.

Political turmoil in Nepal: Split in ruling NCP, realignment with Monarchist forces expected
రాచరిక శక్తులతో కలిసేందుకు ఓలి వెనకాడరా?
author img

By

Published : Dec 22, 2020, 12:48 PM IST

పార్లమెంట్​ను రద్దు చేసి నేపాల్​లో రాజకీయ సంక్షోభానికి తెరలేపారు కేపీ శర్మ ఓలి. అధికారం కోసం పార్టీలో వర్గ పోరు నడుస్తున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం... నేపాల్ రాజకీయాలను అస్థిరతలో పడేసింది. అయితే.. మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినందునే చివరి ప్రయత్నంగా పార్లమెంట్ రద్దును ఓలి చేపట్టారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ముందుగా ఊహించినవేనని అంటున్నారు.

ఇదీ చదవండి: నేపాల్‌ పార్లమెంటుపై 'ఖడ్గ' చాలనం

"పార్టీలో అధికారం కోసం గొడవలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఏవో కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పటికే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి ఓలి లొంగలేదు. పార్టీని ఎదిరించారు. ఈ ఎత్తుగడలు ఊహించినవే. పార్లమెంట్​లో విశ్వాస తీర్మానం నెగ్గలేనని ఓలికి తెలుసు. తనకు మెజార్టీ మద్దతు లేనందునే పార్లమెంట్​ను రద్దు చేశారు."

-ఎస్​డీ ముని, విదేశీ వ్యవహారాల నిపుణులు

నేపాల్​లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు భారత ప్రభుత్వ మాజీ రాయబారి ఎస్​డీ ముని. పార్లమెంట్​ను రద్దు చేస్తూ ఓలి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చితే.. ఆ దేశంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వ్యతిరేకంగా తీర్పు వస్తే ఓలి రాజీనామా చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే పార్టీ రెండుగా చీలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అదే జరిగితే రాచరిక శక్తులతో కలిసేందుకు ఓలి వెనకాడరని తెలిపారు.

"ఒకవేళ పార్టీ చీలిపోతే కొన్ని సమీకరణాలు మారిపోతాయి. అవి ఊహించడం కష్టమే. రాచరిక శక్తులతో చేతులు కలిపేందుకు కూడా ఓలి వెనకాడరని నేను అనుమానిస్తున్నాను. భారత్​లోని భాజపా వర్గాల నుంచి వారికి కొంత మద్దతు వస్తుండటం వల్ల వారు(రాచరికవాదులు) పటిష్ఠంగా మారుతున్నారు. ఎలాంటి కూటములు వస్తాయో చెప్పలేం. అయితే వీరు కలిసే ఆస్కారం ఉంది. నేపాలీ కాంగ్రెస్ అనుమతించే అవకాశం లేదు కాబట్టి షేర్ బహదుర్ దేవాతో చేతులు కలపకపోవచ్చు. పలు చిన్నపార్టీలతోనూ కలిసే అవకాశం ఉంది."

-ఎస్​డీ ముని, విదేశీ వ్యవహారాల నిపుణులు

భారత్​కు ఏంటి?

నేపాల్​ రాజకీయ సంక్షోభంపై భారత్​ ఇప్పుడు అయోమయంలోనే ఉందని తెలిపారు ముని. నేపాల్​లో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ కూటమి అధికారం చేపడుతుందనే అంశంపై స్పష్టత లేదని అన్నారు.

"భారత్​కు చైనాతో భద్రతాపరంగా ముప్పు ఉంది. సరిహద్దుతో పాటు, సంఘ వ్యతిరేక శక్తుల సమస్య ఉంది. కొన్ని వర్గాలకు భారత్ మద్దతు ఇవ్వచ్చు. కానీ నేపాల్​లో అధికార పంపిణీ పెద్ద సమస్యతో కూడుకున్నది. నేపాల్​లో రాజకీయ అస్థిరత.. అధికార పంపిణీ వల్లే తలెత్తుతూ ఉంటుంది. ప్రస్తుత సంక్షోభం ఎలా ముగుస్తుందో మనకు తెలీదు."

-ఎస్​డీ ముని, విదేశీ వ్యవహారాల నిపుణులు

నేపాల్​లో రాజకీయ అస్థిరత.. భారత్​కు మంచిది కాదని ముని పేర్కొన్నారు. ఇది మన దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేది తెలియనప్పటికీ.. ఓలి కఠిన పరిస్థితుల్లో ఉండటం, కమ్యునిస్టు పార్టీ విచ్ఛిన్నం కావడం భారత్​కు కొంతవరకు సాంత్వన కలిగించేదని చెప్పారు. ఎన్​సీపీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నప్పటికీ.. ఎవరు ఎవరితో కలుస్తారనేది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

భారత్​-నేపాల్​ వివాద ఫలితం.. జల ఆశయాలకు గండి?

భారత్​పై నేపాల్​కు ఎందుకంత అక్కసు?

భారత్​పై ముప్పేట దాడికి డ్రాగన్‌ పన్నాగం

నేపాల్​ అధికార పార్టీలో చీలిక తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.