బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తుంగీపారాలోని బంగబంధు సమాధిని సందర్శించారు. పుష్ప గుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కొద్ది నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బంగబంధు కుమార్తెలైన ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, షేక్ రెహ్నా పాల్గొన్నారు.
షేక్ ముజీబుర్ రహ్మాన్ జీవితం బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు.



బంగబంధు సమాధి ఆవరణలో ప్రధాని మొక్కను నాటారు. మోదీ.. బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన తొలి విదేశీ ప్రధానిగా నిలిచారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి : గాంధీ శాంతి పురస్కారాన్ని రెహ్నాకు అందించిన మోదీ