ETV Bharat / international

'కాల్పుల విరమణ పాటించం- దాడులు మళ్లీ ప్రారంభిస్తున్నాం'

Pakistani Taliban ceasefire: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తాలిబన్లు ముగింపు పలికారు. డిమాండ్లను సర్కారు నెరవేర్చలేదని, కాబట్టి కాల్పులు పునఃప్రారంభించే హక్కు తమకు ఉంటుందని స్పష్టం చేశారు.

PAK TALIBAN ceasefire
PAK TALIBAN ceasefire
author img

By

Published : Dec 11, 2021, 6:42 AM IST

Pakistani Taliban ceasefire: నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)... ఇమ్రాన్‌ సర్కారుతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలికింది. తమ దాడులు మళ్లీ కొనసాగుతాయని ప్రకటించింది. పాకిస్థాన్‌ భద్రతా బలగాలు, పౌరులే లక్ష్యంగా ఈ సంస్థకు చెందిన తాలిబన్లు 14 సంవత్సరాలుగా దాడులు చేస్తున్నారు. 2014లో పెషావర్‌లోని పాఠశాలపై దాడిచేసి, 150 మంది చిన్నారులను బలి తీసుకున్నదీ వీళ్లే!

Tehreek e Taliban pakistan attacks:

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైన క్రమంలో, తమ దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వారితో ఒప్పందానికి ప్రయత్నించారు. ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ (ఐఈఏ) మధ్యవర్తిత్వం వహించడంతో టీటీపీ-పాకిస్థాన్‌ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. నవంబరు 9 నుంచి నెల రోజులపాటు కాల్పులను విరమించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. అయితే, జైల్లో మగ్గుతున్న తమ సంస్థకు చెందిన 120 మంది ముజాహిదీన్లను ఐఈఏ ద్వారా విడిచిపెట్టాలని టీటీపీ ప్రధాన షరతు విధించింది. ఇందుకు ఇమ్రాన్‌ ప్రభుత్వం అంగీకరించింది.

'దాడులు చేసే హక్కు ఉంటుంది'

అయితే, పాక్‌ సర్కారు తమ డిమాండ్లను నెరవేర్చలేదని, పైగా మిలిటెంట్‌ శిబిరాలపై దాడులు జరిపి పలువురిని హతమార్చిందని టీటీపీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు ముఫ్తీ నూర్‌ వలీ గురువారం ఆడియో సందేశం విడుదల చేశాడు. పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి, మధ్యవర్తుల నుంచి ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఎలాంటి సమాచారం లేనందున... దాడులను పునః ప్రారంభించే హక్కు తమ యోధులకు ఉంటుందని నూర్‌ వలీ అందులో స్పష్టంగా పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నా.. ఏమంటారు?: మస్క్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.