జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370 అధికరణాన్ని పునరుద్ధరించే వరకు భారత్‌తో దౌత్య సంబంధాలు ఉండబోవని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. బుధవారం నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. కశ్మీరీ సోదర సోదరీమణులకు మొత్తం పాకిస్థాన్ అండగా ఉందని తెలిపారు.
370 అధికరణాన్ని ఉపసంహరించిన దగ్గర నుంచి భారత్‌తో సంబంధాలను కనిష్ఠ స్థాయికి తగ్గించింది పాక్. వాణిజ్య సంబంధాలను రద్దు చేసింది. అయితే ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇతరులు దీంట్లో జోక్యం చేసుకోకూడదని భారత్ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది.
కిషన్‌రెడ్డి వ్యాఖ్యకు ఖండన
జమ్ములో జరిగిన డ్రోన్ల దాడి వెనుక పాక్ ప్రమేయాన్ని కాదనలేమంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యను ఆ దేశ విదేశాంగ శాఖ ఖండించింది. తమ పాత్ర లేదని తెలిపింది.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: పర్యటక రంగానికి 4 ట్రిలియన్ డాలర్ల నష్టం!