ETV Bharat / international

'భారత్​తో అణుయుద్ధం మేము మొదలు పెట్టం' - పాక్​

ఆర్టికల్​ 370 రద్దుతో భారత్​-పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం మొదటగా అణ్వాయుధాలను భారత్​పై ప్రయోగించదని స్పష్టం చేశారు.

'భారత్​తో అణుయుద్ధం మేము మొదలు పెట్టం'
author img

By

Published : Sep 2, 2019, 11:41 PM IST

Updated : Sep 29, 2019, 5:49 AM IST

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌- పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ దేశం మొదటగా అణ్వాయుధాల్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించబోదన్నారు.

లాహోర్‌లోని సిక్కులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

"ఇరు దేశాలూ అణ్వాయుధాలు కలిగి ఉన్నవే. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా కొనసాగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది" - ఇమ్రాన్​ ఖాన్​

జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుచేయడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్‌తో అణుయుద్ధానికి సిద్ధమేనని గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన కొందరు మంత్రులు కూడా పూటకో ప్రకటనలు చేస్తూ మరింతగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చూడండి:మోదీకి 'గేట్స్​' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్

Tonk (Rajasthan), Sep 02 (ANI): A truck got stuck in the middle of the road due to flash flood in Banas river. Commuters are facing problem to cross the area in Rajasthan's Tonk. Normal life has been affected due to excessive flow of water in the residential area nearby.
Last Updated : Sep 29, 2019, 5:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.