ETV Bharat / international

జూన్​ వరకు ఎఫ్​ఏటీఎఫ్​​ గ్రే లిస్టులోనే పాకిస్థాన్!​ - ఎఫ్​ఏటీఏప్​ జాబితాలో పాకిస్థాన్​

ఉగ్రవాద కార్యకలాపాలపై నాన్చుడు ధోరణి అవలంబిస్తున్న పాకిస్థాన్​కు అంతర్జాతీయ ఆర్థిక సాయం అందే విషయంలో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. జూన్​వరకు పాక్​... ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్ 'గ్రే' జాబితా​లోనే కొనసాగే అవకాశాలున్నాయి.

pakisthan in fatf list
జూన్​ వరకు ఎఫ్​ఏటీఎఫ్​​ గ్రేలిస్టులోనే పాకిస్థాన్!​
author img

By

Published : Feb 17, 2021, 9:45 PM IST

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు కష్టాలు వీడే అవకాశం కనిపించటం లేదు. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, మనీలాండరింగ్‌ నేరాలకు పాల్పడుతుందనే కారణంతో పాకిస్థాన్​‌ను గ్రే జాబితాలో చేర్చిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్(ఎఫ్​ఏటీఎఫ్).. పాక్​ను జూన్​ వరకు అదే జాబితాలో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎఫ్​ఏటీఎఫ్​ ప్లీనరీ, వర్కింగ్​ గ్రూప్​ సమావేశం ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 26 మధ్య పారిస్​లో జరగనుంది. ఈ సమావేశంలో పాకిస్థాన్​ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఎఫ్​ఏటీఎఫ్​.. పాకిస్థాన్​ను 2018 జూన్‌లో గ్రే జాబితాలో చేర్చింది. నిర్దేశిత గడువులోగా 27 సూత్రాల కార్యాచరణను పాటించాలని తెలిపింది. అయితే ఎఫ్​ఏటీఎఫ్​ నిర్దేశించిన 6 కీలక విధులను నిర్వర్తించడంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు విఫలమైంది. దాంతో అక్టోబర్​లో జరిగిన సమావేశంలో 2021 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే పాకిస్థాన్​ ఉంటుందని నిర్ణయించింది.

మద్దతు కోసం..

ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులపై పాకిస్థాన్​ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్లీనరీ సమావేశానికి ముందు.. ఎఫ్​ఏటీఎఫ్​ సభ్యదేశాల మద్దతును కూడగట్టేందుకు పాక్​ ప్రయత్నాలు చేస్తోంది. తమ దేశానికి వచ్చి, పరిస్థితులను పరిశీలించాలని కోరుతోంది. ఈ చర్యల ఫలితంగా.. ఈ ఏడాది జూన్​ నాటికి గ్రేలిస్ట్​ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని పాకిస్థాన్​ అధికార వర్గాలు తెలిపాయి.

గ్రేలిస్టు నుంచి వైట్​ లిస్టులోకి వచ్చేందుకు పాకిస్థాన్​కు.. 39 మంది సభ్యులు ఉన్న ఎఫ్ఏ​టీఎఫ్​లో 12 సభ్యుల ఓట్లు కావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:టార్గెట్​ చైనా: బలగాల కూర్పుపై బైడెన్ తర్జనభర్జన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.