పాక్‌ను 'గ్రే' లిస్టులోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్). ఉగ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని నియంత్రించలేకపోవడంపై పారిస్ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీలో దాయాదికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నాటికి తమ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది.
లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలకు అందే నిధులను నియంత్రించలేకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో మరోసారి ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమైన నేపథ్యంలో బ్లాక్ లిస్ట్ ముప్పు తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే ‘బ్లాక్ లిస్ట్’లో ఉన్నాయి.
ఈ మేరకు ఉగ్రముఠాలకు నిధుల సరఫరాను కట్టడి చేసేందుకు కొత్తగా మరో 8 అంశాలతో కూడిన లక్ష్యాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ముందుంచింది. టర్కీ మినహా ఎఫ్‌ఏటీఎఫ్ సభ్యదేశాలన్నీ పాక్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: గ్రే లిస్టుతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బే: రావత్