ETV Bharat / international

టీకాపై పాక్ ఆఖరి ప్రయోగం- ఒక్కొక్కరికి రూ.50 వేలు! - corona research in Pakistan

చైనా సహకారంతో పాకిస్థాన్ తయారు చేసిన ఓ వ్యాక్సిన్ ఇప్పుడు మూడో దశ ప్రయోగానికి అనుమతులు పొందింది. ప్రాణాలు పణంగా పెట్టి.. ఈ ప్రయోగంలో పాల్గొనే వలంటీర్లకు రూ. 50,000 చెల్లిస్తోంది పాక్. 56 రోజుల ఈ ప్రయోగం పూర్తయ్యాకే ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.

pakistan-to-conduct-phase-iii-clinical-trial-of-covid-19-vaccine
పాక్ వ్యాక్సిన్ ఆఖరి ప్రయోగం- ఒక్కో వాలంటీర్ కు రూ.50 వేలు!
author img

By

Published : Aug 18, 2020, 5:30 PM IST

పాకిస్థాన్​లో కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. చైనాకు చెందిన బీజింగ్ బయోటెక్నాలజీ సంస్థతో కలిసి కాన్​సినో బయో సంస్థ.. ఈ టీకాను తయారు చేసింది. పాకిస్థాన్ జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం వ్యాక్సిన్ రెండు దశల ప్రయోగాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాకే, మూడోదశ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ.

ప్రయోగంలో పాల్గొంటే రూ. 50,000/-

మార్చ్ 24న పాక్ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫయాద్ చౌదరి వ్యాక్సిన్ తయారీ కోసం... 'కొవిడ్-19 సైంటిఫిక్ టాస్క్ ఫోర్స్' పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పడు మూడో దశ ప్రయోగం కోసం కరాచీ నుంచి 18 ఏళ్లు పైబడిన సుమారు 200 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వ్యాక్సిన్ ప్రయోగంలో పాల్గొన్నందుకు ఒక్కో వలంటీర్​కు రూ. 50,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు కమిటీలోని ఓ అధికారి.

దాదాపు 56 రోజులపాటు కొనసాగే ఈ ప్రయోగంలో.. ఒక్కో వ్యక్తికి మూడు డోసులిచ్చి అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే వ్యాక్సిన్​ను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటోంది పాక్ జాతీయ ఆరోగ్య సంస్థ.

ఇదీ చదవండి: కరోనాపై పోరు కోసం భారత్​కు బ్రిటన్​ 30కోట్ల నిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.