ETV Bharat / international

భారత్​పై పాక్​ 'రివెంజ్​ షో' అట్టర్​ ఫ్లాప్​- గాల్లోనే పేలిపోయిన మిసైల్! - pak missile news

Pakistan Missile Retaliation: సింధ్​లోని జంషోర్ ప్రాంతంలో పాక్​ ప్రయోగించిన ఓ క్షిపణి విఫలమైనట్లు తెలుస్తోంది. ఆకాశంలో ఓ గుర్తుతెలియని మిసైల్ వంటి వస్తువు​​ కిందికి పడిపోతుండడం గమనించినట్లు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి. పాకిస్థాన్​ భూభాగంలో పొరపాటుగా భారత క్షిపణి పడిపోవడానికి ప్రతీకారంగా పాక్​ ఈ మిసైల్​ను ప్రయోగించిందని పాకిస్థాన్​లో ఓ పత్రిక కథనం వెలువరించింది.

Pakistan Missile Retaliation
పాక్ క్షిపణి
author img

By

Published : Mar 18, 2022, 1:41 PM IST

Pakistan Missile Retaliation: భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి పొరబాటుగా పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటన ఇరు దేశాల మధ్య వివాదాలకు తెరలేపింది. ఈ క్రమంలో సింధ్ జంషోర్​ ప్రాంతంలో ​పాక్​ ప్రయోగించిన ఓ మిసైల్​ విఫలమైనట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆకాశంలో ఓ గుర్తుతెలియని రాకెట్​ లేదా మిసైల్​ వంటి వస్తువును గమనించినట్లు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి.

నిజానికి ఈ ప్రయోగం గురువారం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉంది. అయితే.. సాంకేతిక కారణాల వల్ల ఒక గంట ఆలస్యం అయింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రయోగించిన సెకన్లలోనే నింగిలోకి ఎగిరి.. పొగలు గక్కుతూ కిందికి పడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వచ్చాయి.

అయితే.. క్షిపణి ప్రయోగం విఫలమైందన్న వార్తల్ని స్థానిక అధికారిక వర్గాలు ఖండించాయి. అది మిసైల్ కాదని, సైన్యం ప్రయోగించే సాధారణ మోర్టార్ అని తెలిపాయి. అయితే.. గరిష్ఠంగా 5 కి.మీ పరిధి ఉన్న మోర్టార్‌కు ఆ స్థాయిలో ట్రేసర్ ప్రొజక్టైల్ ఉండే అవకాశం లేదు.

నింగి నుంచి 'ఓ విమానం లేదా రాకెట్ లాంటిది' కిందికి పడిపోయినట్లు పాకిస్థాన్​లోని ఏఆర్​వై న్యూస్ ఛానెల్‌ తెలిపింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.

ప్రతీకారంతోనే..

పాకిస్థాన్​ భూభాగంలో భారత క్షిపణి పడిపోవడానికి ప్రతీకారంగానే.. పాక్​ ఈ మిసైల్​ను ప్రయోగించిందని పాకిస్థాన్​కు చెందిన ఓ పత్రిక కథనం వెలువరించింది. లక్ష్యాన్ని చేరేలోపే ఆ క్షిపణి కిందికి పడిపోయినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: భారత్​పై పాక్​ క్షిపణిని ప్రయోగించాలనుకుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.